Thursday, January 23, 2025

తుక్కాపూర్ నుంచి నీటి తరలింపు

- Advertisement -
- Advertisement -

Water is pumped from Tukkapur Pump House to Mallannasagar Reservoir

 

మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి : లక్షలాది ఎకరాలకు సాగునీరును అందించే అతిపెద్ద జలాశయం మల్లన్న సాగర్‌ను నేడు సిఎం కెసిఆర్ ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో కీలక ఘట్టాన్ని ఆవిష్కృతం కానుంది. మల్లన్న సాగర్ జలాశయం తెలంగాణ నడినెత్తిన సంద్రాన్ని తలపించేలా నిర్మించారు. రాష్ట్రంలోనే అతి పెద్ద జలాశయంగా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిలువనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని రిజర్వాయర్లన్నింటిలోనూ మల్లన్నసాగరే అతి పెద్దది. సిద్దిపేట జిల్లా తొగుట – కొండపాక మండలాల శివారులో గుట్టల మధ్య ఈ జలాయాన్ని నిర్మించారు. అత్యంత ఎత్తు మీద నిర్మించిన జలాశయంగా మల్లన్న సాగర్ ప్రత్యేకతను సంతరించుకుంది. డ్యామ్ ప్రోటోకాల్‌ను అనుసరించి ఇప్పటికే నీటి నిల్వ సామర్థ పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసుకున్న మల్లన్న సాగర్‌ను ప్రారంభానికి అధికారులు సర్వ సన్నద్ధం చేశారు.

ప్రాజెక్టులో..

ప్రాజెక్ట్‌లో మల్లన్న సాగర్ అత్యంత కీలకమైంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో కాళేశ్వరం ప్రాజెక్టులో లింక్ 4లోని అన్ని పనులు పూర్తయ్యాయి. కాళేశ్వ రం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్న సా గర్ జలాశయంతో వ్యవసాయ అవసరాలతోపా టు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు తాగునీటి కోసం 30 టిఎంసిలు, పారిశ్రామిక అవసరాల కోసం 16 టిఎంసిల నీటిని ఈ రిజర్వాయర్ నుంచి ఏడాది పొడవునా అందించే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని 12 నుంచి 19 ప్యాకేజీల ద్వారా సుమారు. 8.33 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు.

ఎస్‌ఆర్‌ఎస్సీ స్టేజ్-1, నిజాంసాగర్, సింగూరు ప్రాజెక్టు కింద కొత్త, పాత ఆయకట్టు కలుపుకొని 15 లక్షల 71, 050 ఎకరాలు ఈ రిజర్వాయర్ కిందికి రానున్నా యి. రిజర్వాయర్ వైశాల్యం 17,600 ఎకరాలు కాగా, 10.5 కిలో మీటర్ల పొడవున్న గుట్టలను ఇరువైపులా కలుపుతూ 22.6 కిలో మీటర్ల కట్టను నిర్మించారు. 10 టిఎంసిలకు ఒక అంచె చొప్పున ఐదు అంచెల్లో దీన్ని కట్టారు. 143 మీటర్ల పోడవు తో మత్తడిని ఏర్పాటు చేశారు. మల్లన్న సాగర్ పరివాహాక ప్రాంతం 75 చదరపు కిలో మీటర్ల మేర విస్తరించి ఉంది. మిషన్ భగీరథ కింద 7 జిల్లాల పరిధిలోని 9 నియోజక వర్గాలకు తాగునీరు అందనుంది. తుక్కాపూర్ పంప్ హాస్ నుంచి మల్లన్నసాగర్‌కు జలాశయానికి నీటిని తరలిస్తారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News