Sunday, December 22, 2024

పార్లమెంట్‌లో వాన జల్లులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: న్యూ ఢిల్లీలోని కొత్త పార్లమెంట్ భవనం చిన్నపాటి వర్షాలకే కురుస్తుందని ఖమ్మం పా ర్లమెంట్ సభ్యులు రామసహాయ రఘురాంరెడ్డి ఆరోపించారు. రూ.862 కోట్ల తో నిర్మించిన ఈ భవనం గత మే 3న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారని, సుమారు వందేళ్ళ నాటి పాత పార్లమెంటు భవనం బాలేదనే సాకుతో కొత్తగా నిర్మించిన ఈ కార్పొరేట్ భవనం.. ఏడాది గడిచిందో లేదో.. చిన్న పాటి వర్షాలకే కురుస్తుందని. నింగి నుంచి జల్లు పడుతుంటే.. కోట్లాది రూపాయల ప్రజల సొమ్ముతో నిర్మించిన దేశ అత్యున్నత ప్రజాస్వామ్య సౌధం.. గుడారం మాదిరిగా కారుతోందని.

కింద బకెట్ పెట్టి మరీ.. సర్దుకుంటున్న దుస్థితి నెలకొందన్నారు. ప్రచార ఆర్భాటం తప్పితే.. పక్కా ప్రణాళిక పనులు లేవని దీనిని బట్టి స్పష్టంగా తెలుస్తోందన్నారు. మోదీ పాలనలో ప్రచార ఆర్భాటాలు తప్పితే.. ఆచరణలో అంతా డొల్ల అని పేర్కొన్నారు. ఈ బీజేపీ పాలనలో ప్రజలకు దక్కేది శూన్యమని అన్నారు. కార్పొరేట్ కార్యాలయ హంగులు తప్పితే.. పది కాలాలపాటు మన్నికయ్యేలా.. రేపటి తరాలకు ఆదర్శంగా నిలిచేలా నిర్మించాలనే ఉద్దేశమే వారికి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News