Sunday, December 22, 2024

గోదావరి ఉగ్రరూపం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/భద్రాద్రి కొత్తగూడెం/హైదరాబాద్: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. గురువారం 20 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం శుక్రవారం సాయంత్రం 6 గంటలకు 26.3 అడుగుల వద్దకు చేరి ప్రవహిస్తోంది. శనివారం సాయంత్రం 5 గంటలకు 35.1 అడుగులు వద్ద ప్రవహిస్తున్నది. 5 లక్షల 89 వేలు 743 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుండి వచ్చిన వరదకు భద్రాచలం వద్ద గోదావరి గంటగంటకు పెరుగుతూ ప్రవహిస్తోంది. నీటిమట్టం పెరగడంతో స్నాన పుఘాట్‌ల ప్రాంతం వరకు వరద నీరు చేరుకుంది. ఆదివారం మొదటి హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. భద్రాచలం ఎగువన ఉన్న చర్ల మండలంలోని తాలిపేరు జలాశయానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. శనివారం ఉదయం 5 గంటల సమయంలో ప్రాజె క్టు వద్ద అధికారులు 25 గేట్లను ఎత్తి 1,43,248 క్యూసెక్కుల వరద నీటిని ది గువన ఉన్న గోదావరి నదిలోనికి విడుదల చేశారు. మరోవైపు దుమ్ముగూడెం మండలంలోని సీతవాగుతో పాటు వివిధ వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తూ గోదావరి నదిలో కలుస్తున్నాయి.

దీంతో వరద ప్రవాహం ఎక్కువస్థాయిలో ఉంది. కిన్నెరసాని ప్రాజెక్టులోకి భారీ ఎత్తున వరద నీళ్లు రావడంతో గేట్లు ఎత్తి గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. కిన్నెరసాని ప్రాజెక్ట్ నుంచి 25 వేల క్యూ సెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు నీటి సామర్థ్యం 407 అడుగులు కాగా వరద ప్రభావం పెరుగు తుండటంతో ప్రస్తుతం 403 అడుగులకు చేరింది. దీం తో శుక్రవారం రాత్రి కిన్నెరసాని గేట్లను ఎత్తారు అదేవిధంగా తాలిపేరు ప్రాజెక్టుకు కూడా పూర్తిస్థాయి నీటిమట్టం రావటంతో 1.50 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. సాయంత్రం 5 గంటల సమయానికి 35.1 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతంలోని ప్రాజెక్టుల నుంచి నీటిని ది గువకు వదలడంతో రానున్న 24 గంటల్లో ఇంకా వరద పెరిగే సూచనలు ఉ న్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రాచలం గోదావరి స్నానఘట్టాలు చాలా వరకు మునిగిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వేటకు వెళ్లవద్దని జాలర్లకు సూచించారు.

భద్రాద్రి రామయ్య దర్శనానికి వచ్చే భక్తులు స్నానం చేసేటప్పుడు లోతుకు వెళ్లవద్దంటూ నది వద్ద హెచ్చరిక బోర్డులు ఏ ర్పాటు చేశారు. తీర ప్రాంతంలో ప్రభుత్వ అధికారులు ఎప్పటికప్పుడు వరద నీటి మట్టం వివరాలను లోతట్టు ప్రాంతవాసులకు అందించాలని కలెక్టర్ జితే ష్ పాటిల్, ఎస్‌పి రోహిత్ రాజ్ ఆదేశించారు. సహాయక చర్యల కోసం ఐడిఒసి కార్యాలయంలో కౌంటర్ ఏర్పాటు చేసి ప్రజలకు 9392919743, 08744-241950 నెంబర్లను అందుబాటులో ఉంచారు.
హోరెత్తిన కృష్ణమ్మ.. వేగంగా నిండుతున్న శ్రీశైలం
మహారాష్ట్ర, కర్ణాటకలో నదీ పరివాహకంగా కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నది వరదనీటితో హోరెత్తింది. మలప్రభ ప్రమాదస్థాయికి చేరింది. కూడల సం గమం వద్ద కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. ఆల్మటి ప్రాజెక్టు గరిష్టస్థాయికి చే రువ కావటంతో గేట్ల ద్వారా 69వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దిగువన నారాయణపూర్‌లోకి లక్ష క్యూసెక్కులు చేరుతుండడంతో ప్రాజెక్టు 22గేట్లు ఎత్తివేసి 108860క్యూసెక్కుల నీటిని దిగువన జారాలకు వదులుతు న్నారు.

జూరాలకు 83వేల క్యూసెక్కులు చేరుతుండగా రెండు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా గరిష్ట స్థాయిలో ఉద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. దిగువకు 96674క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. తుంగభద్ర ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 103787క్యూసెక్కులు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులో నీటి నిలువ 68.77టిఎంసీలకు పెరిగింది. ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి ఈ సీజన్‌లో తొలిసారిగా 81160క్యూసెక్కుల వరద ప్రవాహం చేరుతోంది. నీటి నిలువ 36.56 టిఎంసిలకు పెరిగింది. ప్రాజెక్టులో వరద ఉధృతి పెరుగుతుం డడంతో కుడి, ఎడమ గట్ల నుంచి విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసి దిగువకు నీటి విడుదలను ఆపేశారు. సాగర్ రిజర్వాయర్ నుంచి తాగునీటి అవసరాలకోసం 9874క్యూసెక్కుల నీటి విడుదలను కొనసాగిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News