- Advertisement -
ముంబై : మహారాష్ట్రలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఠాణే, పాల్ఘర్ తదితర జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఠాణే జిల్లాలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి రాష్ట్రముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నివాసం చుట్టూ వరద నీరు చేరింది. స్థానిక రెస్కూ సిబ్బందికి ఈ సమాచారం అందగానే వెంటనే అక్కడకు చేరుకుని వరద నీరు తొలగించినట్టు పేర్కొన్నారు. రానున్న మూడు రోజుల్లో పుణె, సతారా, కొల్హాపూర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముంబైలో గురువారం కూడా కుండపోత వర్షం కురుస్తోంది.
- Advertisement -