Monday, January 20, 2025

పుచ్చకాయను ఉప్పుతో కలపి తింటున్నారా?..కలిగే లాభ, నష్టాలు ఇవే..!

- Advertisement -
- Advertisement -

వేసవి కాలంలో పుచ్చకాయని తినడానికి అందరూ ఇష్ట పడుతారు. దీన్ని తినడం వల్ల శరీరంలో నీటి లోపం తొలగిపోతుంది. ఇందులో ఉండే మినరల్స్, విటమిన్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చాలా మంది పుచ్చకాయను రసం చేసుకొని తాగుతూ ఉంటారు. అంతేకాకుండా పుచ్చకాయపై ఉప్పు చల్లి తినడానికి చాలా మంది ఇష్టపడతారు. దీనివల్ల పుచ్చకాయలో తియ్యదనం పెరుగుతుందని నమ్మకం. అయితే ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుందని కొందరు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో మనం పుచ్చకాయలో ఉప్పు వేసి తినాలా వద్దా అనేది ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

పుచ్చకాయలో ఉప్పు కలిపి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

ఉప్పు పుచ్చకాయ చేదును తగ్గించి తీపిని పెంచుతుంది. అంతేకాకుండా ఆహార ప్రియులకి అద్భుతమైన రుచిని కలిగిస్తుంది. ఉప్పు పుచ్చకాయ నుండి నీటిని బయటకు తీస్తుంది. దీంతో పుచ్చకాయ మరింత జ్యుసిగా ఐతుంది.

పుచ్చకాయపై ఉప్పు చల్లిన తర్వాత తినడం వల్ల కలిగే నష్టాలు

పుచ్చకాయలో ఉప్పు కలిపి తినడం వల్ల శరీరంలో సోడియం పరిమాణం పెరుగుతుంది. అయితే, ఇది అనేక సమస్యలను కలిగిస్తుంది. దీని కారణంగా రక్తపోటు పెరగవచ్చు. ఉప్పు ఎక్కువగా ఉండటం వల్ల బీపీ రోగుల సమస్యలు కూడా పెరుగుతాయి. దీని కారణంగా.. పోషకాహార సమస్యలు కూడా తలెత్తుతాయి.

పుచ్చకాయలో ఉప్పు వేయాలా వద్దా?

పుచ్చకాయ తక్కువ కేలరీల పండు. ఇందులో విటమిన్ ఎ, సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పుచ్చకాయలో కొద్దిగా ఉప్పు కలపడం వల్ల దాని పోషణపై పెద్దగా ప్రభావం ఉండదు. కానీ, రోజంతా సోడియం ఎక్కువగా తీసుకుంటే..సమస్యలు బాగా పెరుగుతాయి. అందువల్ల ఉప్పు సమతుల్యతను కాపాడుకోవడం ద్వారా పుచ్చకాయ తినడం వల్ల ఎటువంటి సమస్య ఉండదు. అయితే, ఎక్కువ ఉప్పు తీసుకోవడం మానుకోవాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News