Monday, December 23, 2024

ఫిబ్రవరి 20 నుండి ఆల్ ఇండియా సెకండ్ నేషనల్ వాటర్ పోలో ఛాంపియన్షిప్ క్రీడలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ , స్పోర్ట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ , తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో వచ్చే నెల ఫిబ్రవరి 20 నుండి 26వ తేదీ వరకు ఆల్ ఇండియా సెకండ్ నేషనల్ వాటర్ పోలో ఛాంపియన్షిప్ క్రీడలు జరుగనున్నాయి. వీటి నిర్వహణపై రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మంగళవారం నాడు క్రీడాకారులతో చర్చించారు. అలాగే తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన పి. చంద్రశేఖర్ రెడ్డిని రాష్ట్ర మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. తెలంగాణ రాష్ట్రంలో స్మిమ్మింగ్ క్రీడాభివృద్ధిపై ఈ సందర్భంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హాకీ సంఘం అసోసియేషన్ ఛైర్మెన్ కొండ విజయ కుమార్, స్విమ్మింగ్ అసోసియేషన్ కోశాధికారి సమంత రెడ్డి, స్విమ్మింగ్ కోచ్ శశాంక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News