Monday, December 23, 2024

నేటి నుంచి నీటి నాణ్యత పరీక్షలు రెట్టింపు

- Advertisement -
- Advertisement -
ముప్పు ప్రాంతాల్లో వరద నీరు తొలగింపు
జలమండలి ఎండీ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్
పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశం

హైదరాబాద్ : ప్రస్తుతం చేస్తున్న నీటి నాణ్యత పరీక్షలను నేటి నుంచి రెట్టింపు చేయాలని జలమండలి ఎండీ దానకిశోర్ అధికారులను ఆదేశించారు. రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆయన డైరెక్టర్లు, సీజీఎంలు, జీఎలుం, డీజీఎంలు, ఇతర అధికారులతో ఖైరతాబాద్ లోని ప్రధాన కార్యాలయంలో టెలీ కాన్ఫరెన్స్ శుక్రవారం నిర్వహించారు.
ఈసందర్భంగా మాట్లాడుతూ ముంపు ప్రాంతాల్లో వరద నీరు తొలగింపు, సివర్ జెట్టింగ్ యంత్రాల ఆపరేషన్లను ఆయా డీజీఎంలు తనిఖీ చేయాలన్నారు. వీటిని సంబంధిత సీజీఎంలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.

వర్షం కారణంగా రహదారులపై ఉన్న మ్యాన్ హోళ్ల వద్ద సీవరేజీ ఓవర్ ఫ్లో పై వచ్చే ఫిర్యాదులను పరిష్కరించాలని సూచించారు. అంతేకాకుండా ప్రజల ఇంటి వద్ద చోక్ అయినా సమస్య పరిష్కరించడానికి ప్రాధాన్యమివ్వాలని జీఎంలను ఆదేశించారు. లోతైన మ్యాన్ హోళ్లు, మురుగు ఉప్పొంగే ప్రాంతాలను సందర్శించి తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే కార్మికులు పని జరిగే ప్రదేశాల్లో తప్పనిసరిగా హెల్మెట్లు, గ్లౌజులు, గమ్ బూట్స్ ధరించడంతో పాటు ఇతర రక్షణ చర్యలు పాటించేలా చూడాలన్నారు. ఆయా రిజర్వాయర్లను సంబంధింత అధికారులు, సిబ్బంది తనిఖీ చేయాలని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో క్లోరిన్ మాత్రల్ని పంపిణీ చేయాలని సూచించారు. వీటిని క్వాలిటీ అనాలసిస్ వింగ్ జనరల్ మేనేజర్ ఇతర అధికారుల సమన్వయంతో పంపిణీ చేయాలన్నారు. జీహెచ్‌ఎంసీ, పోలీసు అధికారులను సమన్వయం చేసుకుంటూ పనులు చేయాలని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News