Thursday, January 23, 2025

ఎల్లంపల్లి నుంచి ఎస్‌ఆర్‌ఆర్ రిజర్వాయర్‌కు నీటి విడుదల

- Advertisement -
- Advertisement -

ధర్మారం : వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా వర్షాల జాడ లేకపోవడంతో ఉన్న నీటిని సాగు, తాగు కోసం వాడాలని నిర్ణయించిన సిఎం కెసిఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నంది పంపుహౌస్ ద్వారా ఎస్‌ఆర్‌ఆర్ రిజర్వాయర్‌కు నీటిని తరలించే ప్రయత్నాలు అధికారులు సోమవారం ఉదయం ప్రారంభించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న నీటిని విడుదల చేస్తుండటంతో నంది మేడారంలోని భూగర్భంలో నిర్మించిన నంది పంపుహౌస్‌కు చేరుకోవడంతో వెంటనే నంది పంపు హౌస్‌లోని రెండు బాహుబలి మోటార్లను రన్ చేయడంతో నంది మేడారం నంది రిజర్వాయర్ డెలివరీ సిస్టం వద్ద నీటిని ఎత్తిపోసే ప్రక్రియ ప్రారంభమైంది.

ఒకోక్క మోటార్ ద్వారా 3150 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. 0.54 టీఎంసీల నీటిని నిత్యం తరలిస్తున్నారు. మల్లాపూర్ భూగర్భం ద్వారా రామడుగు మండలం లక్ష్మీపూర్‌కు ఈ నీరు చేరుకుంటాయి, అక్కడి నుండి పంపులు ఎత్తి పోయగానే నేరుగా ఎస్‌ఆర్‌ఆర్ రిజర్వాయర్‌కు చేరుకుంటుందని ఇంజనీర్లు తెలిపారు. నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ చీఫ్ నల్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నూనె శ్రీధర్ పర్యవేక్షణ చేస్తున్నారు. నంది పంపు హౌస్‌లో ఎల్లంపల్లి నీటిని ఎత్తి పోస్తుండటంతో నీటి అందాలను చూసేందుకు ప్రజలు తరలి వచ్చి తిలకిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News