Thursday, February 6, 2025

నారాయణపూర్ జలాశయానికి నాలుగు టిఎంసిలు

- Advertisement -
- Advertisement -

అంగీకరించిన కర్నాటక సిఎం
ఫలించిన మహబూబ్‌నగర్‌జిల్లా
కాంగ్రెస్‌నేతల ప్రయత్నాలు
మన తెలంగాణ/హైదరాబాద్ : కర్ణాటక రా ష్ట్ర ప్రభుత్వంను తెలంగాణ ప్రభుత్వం తర పున బెంగుళూరుకు వెల్లిన మహబూబ్ నగర్ ఎంఎల్‌ఎలు,మంత్రులు, కాంగ్రెస్ నాయకు లు.. మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణా రావు, ఎంఎల్‌ఎలు కృష్ణ మోహనరెడ్డి, జి. మధు సూధన్ రెడ్డి, మేఘ రెడ్డి, పర్ణికా రెడ్డి, వాకాటి శ్రీహరి, ఎఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్‌లు బెంగుళూరులో ముఖ్యమంత్రి సిద్దిరామయ్యా, ఉప ముఖ్యమంత్రి డికె శివ కుమార్‌లను బుధవారం కలిసి నారాయణ పూర్ జలాశయం నుంచి 5 టీఎంసీల నీటిని జూరాలకు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశా రు. కాగా 4 టిఎంసిల నీటిని ఇవ్వడానికి క ర్ణాటక ప్రభుత్వం అంగీకరించిందని తెలం గాణ ప్రతినిధులు తెలిపారు. నీటిని విడుదల చేసేందుకు అంగీకరించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News