Friday, January 10, 2025

అనంతగిరి రిజర్వాయర్‌లోకి నీరు విడుదల

- Advertisement -
- Advertisement -

మిడ్ మానేరు నుండి అనంతగిరి రిజర్వాయర్‌లోకి అధికారులు సోమవారం నీటిని విడుదల చేశారు. పంటల సాగుకు రిజర్వాయర్లోకి నీటిని విడుదల చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ తన్నీరు హరీష్ రావు లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన అధికారులు మిడ్ మానేరు నుండి అనంతగిరి రిజర్వాయర్‌లోకి సోమవారం నీటిని పంపింగ్ చేశారు. గోదావరి జలాలతో ఆయకట్టుకు నీళ్ల రావడాన్ని చూసిన అన్నదాతలు ఆనందంతో మురిసిపోయారు. రిజర్వాయర్లలో నీళ్లు లేక, మరోవైపు వర్షాల కరువై రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారంటూ ఎంఎల్‌ఎ హరీష్ రావు రాసిన లేఖకు ప్రభుత్వం స్పందించి నీటిని విడుదల చేసినందుకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News