మహబూబ్‌నగర్ : జూరాల బ్యాక్ వాటర్ నుంచి ఉంద్యాల, లంకాల గ్రామ శివారులోని పంప్ హౌస్ ఫేస్ 1 దగ్గర కాలువ ద్వారా సోమవారం నీటిని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి , మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భ ంగా ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ జూరాల నుంచి ఉంద్యాల పంప్ హౌస్ పేజ్ 1 నుంచి లిఫ్ట్ ద్వారా కోయిల్‌సాగర్‌కు తాగునీటి కోసం విడుదల చేసుకోవడం జరిగింది.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వర్షాలు రావడం లేటు అయినందున తాగునీటికి ఇబ్బ ంది కలుగకుండా ముందు చూపుతో జూరాలకు ఇన్ ఫ్లో లేనందు వల్ల ఒక మోటారు ద్వారా నీటిని తాగునీటి అవసరాలకు కో యిల్‌సాగర్‌కు విడుదల చేసుకోవడం జరిగింది. ఇంకో వారం లో వర్షాలు ఎక్కువగా పడితే రెండో మోటార్‌ను ప్రారంభించి పర్దిపూర్ రిజర్వాయర్‌ను నింపుతామని తెలిపారు. ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి మాట్లాడుతూ జూరాల ప్రాజెక్టుకు వచ్చే వరద నీటిని కోయిల్‌సాగర్ భూత్పూర్ సంగం బండ రిజర్వాయర్లను నింపడం జరుగుతుందన్నారు. ఈ ప్రాంత చెరువులను నింపడం పట్ల భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వర్షాకాల ఆరంభంలోని అన్ని ప్రాజెక్టులను నింపుతున్నట్లు వారు తెలిపారు.