Wednesday, January 22, 2025

సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల…

- Advertisement -
- Advertisement -

Water release to left canal from nagarjuna sagar project

నల్లగొండ: ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు 6.50లక్షల ఎకరాలకు నీరందించేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి  సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు నోముల భగత్, శానంపూడి సైదిరెడ్డి, శాసనమండలి సభ్యులు ఎంసి కోటిరెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రామచంద్ర నాయక్, తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడారు.  దశాబ్దా కాలం తరువాత జూలైలో నీటి విడుదల చేశామని, జూలైలో విడుదల చేయడం రెండు దశాబ్దాల రెండు సంవత్సరాలలో ఇది ఇదో సారి అని,  స్వరాష్ట్రం ఆవిర్భావం తరువాత ఇదే జూలైలో విడుదల చేయడం ఇదే తొలిసారి అని ప్రశంసించారు.

ఎడమ కాలువ పరిధిలోని నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో 6.16 లక్షల ఏకరాలలో సాగు అవుతోందని, నల్లగొండ జిల్లాలో 1,45,727 ఎకరాలు, సూర్యాపేట జిల్లా పరిధిలో 1,45,727 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో(ఎత్తిపోతల తో కలుపుకుని 2,41,000 ఎకరాలు సాగు నీరు అందుతుందన్నారు.  నల్లగొండ జిల్లాకు 18 టిఎంసిలు, సూర్యాపేట జిల్లాకు 18 టిఎంసిలు, ఖమ్మం జిల్లాకు 29 టిఎంసిల సాగు నీరు అందిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాల వాటాలో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారు. తద్వారా ఆయకట్టు రైతాంగానికి సకాలంలో నీరు అందుతుందని,  సాగర్ జలాశయానికి గత సంవత్సరంతో పోలిస్తే అదనంగా నీరు వచ్చి చేరుతుందని. ఆయకట్టు రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News