Wednesday, January 22, 2025

కాకతీయ కాలువ..యాసంగి పంటకు నీటి విడుదల

- Advertisement -
- Advertisement -

మెండోరా: మెండోరా మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాకతీయ కాలువ ద్వారా యాసంగి పంటలకు సోమవారం నుంచి నీటిని విడుదల చేస్తున్నట్లు ఈ అవకాశాన్ని ఆయకట్టు పరిధిలోని రైతులందరూ సద్వినియోగపరుచుకోవాలని ప్రాజెక్టు ఎస్‌ఈ జి. శ్రీనివాస్ తెలిపారు. మొదటి ఏడు రోజులు డిస్ట్రిబ్యూటరీ 53 జోన్ 1 ద్వారా ఆయకట్టు పరిధి వరకు తర్వాత ఏడు రోజులు, తరువాత ఎనిమిది రోజులు జోన్2 ఆయకట్టుకు ఆన్ అండ్ ఆఫ్ పద్ధ్దతిలో సాగునీరును అందించబడుతుందని తెలిపారు. ప్రాజెక్టులో గత ఏడాది కంటే ఈ ఏడాది నీటి సామర్థం తక్కువగా ఉండటం వలన యాసంగి పంటకు బోటా బోటీగా సరిపోయే నీరు మాత్రమే ఉన్నందు వలన రైతులు సాగునీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని నీటిపారుదల శాఖకు సహకరించాలని ఆయన కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News