Monday, December 23, 2024

జల వనరుల ఖజానా తెలంగాణ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ దూరదృష్టి.. ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ, భారీ ఎత్తిపోతల పథకాల నిర్మాణాలు జాతీయ స్థాయిలో తెలంగాణను జల ఠానాగా నిలిపాయి. దేశంలో మరే రాష్ట్రంలో లేనంతగా ఇక్కడి ప్రభుత్వం జల సంరక్షణపై చేసిన కృషి ఫలించింది. ఎటూ చూసిన నీటి వనరులే ద ర్శనమిస్తూ కాకతీయుల నాటి కాలాన్ని తలపిస్తున్నాయి. అందుకేనా అన్నట్టుగా ముఖ్యమంత్రి కేసిఆర్ చెరువుల పు నరుద్ధరణ కార్యక్రమానికి మిషన్ కాకతీయ అని పేరుపె ట్టి కాకతీయులు జల వనరుల పట్ల ఇచ్చిన ప్రాధాన్యత, ఆ నాటి స్పూర్తిని చాటి చెప్పారు.

తెలంగాణలో బిఆర్‌ఎస్ ప్రభుత్వ కృషితో భూగర్భ జల మట్టం గణనీయంగా వృద్ధి లోకి వచ్చింది. రాష్ట్రంలో 680 మేరకు భూగర్భ జలం అందుబాటులో ఉన్నట్టు ప్రభుత్వం నిర్ధారించింది. అంతేకాకుండా కృష్ణా, గోదావరి నదీజలాల ఆధారంగా ఇప్పటికే ఉన్న జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ , శ్రీ రాంసాగర్ తదితర ప్రాజెక్టులతో పాటుగా, అత్యంత అ ధునాత సాంకేతకతను ఉపయోగించుకుంటూ చేపట్టిన కాళేశ్వరం, పాలమూరురంగారెడ్డి వంటి భారీ ఎత్తిపోత ల పథకాల నిర్మాణాలు కూడా 1248టీఎంసీల ఉపరితల జలాలను అందుబాటులోకి తెచ్చాయి. రాష్ట్రంలో రెండేళ్ల పాటు ఎగువ నుంచి నదీజలాలు ప్రవహించకపోయినా, వర్షా భావ దుర్భిక్ష పరిస్థితులు ఉత్పన్నమైనా రాష్ట్రంలో ఎ టువంటి కరువు చాయాలు కనిపించకుండా తెలంగాణా ను కాపాడుకునే దిశగా నిర్మించిన రిజర్వాయర్లు ఫలి తాలను ఇస్తున్నాయి. ఒకవైపు ఉపరితల జలాలు, మరో వై పు భూగర్బ జలాలు వెరిసి 1928టీఎంసీలు తెలంగాణకు జల వనరుల రంగంలో పెద్దభరోసా కల్పిస్తున్నాయి.
చిన్ననీటి వనరుల్లోనే మేటిగా తెలంగాణ
చిన్ననీటి వనరుల్లోనూ జాతీయ స్థాయిలో తెలంగాణ మే టిగా నిలిచింది. ఇటీవల కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నీటివనరుల నివేదికలో కూడా తె లంగాణ రాష్ట్రం సముచిత స్థానంలో నిలిచింది. వనరుల్లో తెలంగాణ రాష్ట్రం ఐదవ స్థానంలో నిలిచింది. భూగర్భ జల వనరుల్లో కూడా 5వ స్థానంలో నిలిచింది. ఉపరితల నీటి వనరుల్లో మూడవ స్థానంలో నిలిచింది. జాతీయస్థాయికి సంబంధించి చిన్ననీటి వనరుల్లో తెలం గాణ రాష్ట్ర వాటా 7.3శాతంగా ఉందని కేంద్ర జల వ నరుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో చిన్ననీటి వనరుల అభివృద్దిలో 16.3శాతం వృద్ది కనిపించినట్టు కేం ద్రం వెల్లడించింది. కేంద్ర జలవనరుల శాఖ అన్నిరాష్ట్రాల్లో చేపట్టిన 5వ జాతీయ చిన్ననీటి వనరుల గణాంకాల నివేదికకు, 6వ జాతీయ చిన్ననీటి వనరుల గణాకాల నివే దికకు మధ్య నీటివనరుల వృద్ధి శాతాన్ని కూడా వివ రించింది. 5వ జాతీయ నీటివనరుల గణాంకాల నివేది కలో తెలంగాణ రాష్ట్రంలో చిన్ననీటి వనరుల ద్వారా 30,14,446 హెక్టార్ల ఆయకట్టు ఉన్నట్టు వెల్లడించగా, ఆరవ జాతీయ నీటివనరుల గణాంకాల నివేదికలో తెలంగాణ రాష్ట్రంలో 35,06,333 హెక్టార్లకు ఆయకట్టు పెరిగినట్టు వెల్లడించింది.
మిషన్‌కాకతీయతో ఉబికివస్తున్న భూగర్భజలం
మిషన్ కాకతీయ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం శిధిలావస్థలో ఉన్న చిన్ననీటి వనరులకు పూర్వవైభవం కల్పించింది. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ ప్రాంతంలో 75వేల చెరువులు కుంటలు ఉండేవని పురాతన రికార్డులను బట్టి తెలుస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పటాయ్యాక ముఖ్యమంత్రి కేసిఆర్ గ్రామీణ ఆర్దిక వ్యవస్థకు చెరువులే ఆదరువులుగా గుర్తించారు. రాష్ట్రంలో చెరువుల సంఖ్యను నిగ్గుతేల్చేందకు ప్రత్యేక కమిటీని నియమించి ఊరూరా సర్వేల ద్వారా చెరువుల స్థితిగతులపైన అధ్యయనం చేయించారు. 2014నాటికి రాష్ట్రంలో చెరువుల సంఖ్య 46500గా నిగ్గు తేల్చారు. దశల వారీగా చెరువుల పునరుద్దరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇపుడు రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా చెరువులు నిండుకుండలను తలపిస్తూ కళకళలాడుతూ కనిపిస్తున్నాయి. మిషన్‌కాకతీయ పథకం ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా భూగర్బజల మట్టం కూడా 10మీటర్లు పెరిగింది. ఒకపుడు వందల అడుగుల్లోతుల్లోక వెళ్లినా కనిపించని భూగర్భజలాలు నేడు 50అడుగుల్లోనే ఉబికి వస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News