కృష్ణా జలాల పంపిణీపై ఎన్నికల ఎఫెక్ట్
త్రిసభ్య కమిటీతో కాలం వెళ్లదీయాల్సిందేనా?
మనతెలంగాణ/హైదరాబాద్:తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణానదీజలాల పంపిణీపై లోక్‌సభ ఎన్నికల ప్రభావం పడింది. రానున్న రెండు నెలల్లో వేసవి కాలం ముగియనుంది . జూన్ నుంచి కొత్త నీటి సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ లోపే తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మ ధ్య కృష్ణానదీజలాల పంపిణీకి అంగీకారం కుదుర్చాల్సివుండగా కృష్ణానదీయాజమాన్య బోర్డు నిర్లక్షవైఖరి కారణంగా ఆ అవకాశం చేజారి పోయింది. లోక్‌సభ ఎన్నిక ల కోడ్ నేపధ్యంలో కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకుండా పొయింది. రానున్న ఖరీఫ్ సీజన్‌కు కూడా ఇప్పుడున్న పద్దతిలోనే రెండు రాష్ట్రాలకు నీటివాటాలు కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జస్టిస్ బచావత్ ట్రి బ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 811 టిఎంసీల నీటిని కేటాయిస్తూ తీర్పునిచ్చింది. ఏపి పునర్ విభజన చట్టం మేరకు 2014లో తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రా ష్ట్రంగా ఏర్పాటయ్యాక కేంద్ర ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో రెండు రాష్ట్రాల ముఖ్యల మంత్రుల సమక్షంలో తెలంగాణ ఆంధప్రదే శ్ రాష్ట్రాలకు నీటి పంపిణీ పై ఒప్పదం కుదిర్చింది. ఈ ఒ ప్పందం ప్రకారం ఏపికి 512 టిఎంసీలు , తెలంగాణకు 299 టిఎంసిల నీటి పంపిణీ జరిగింది. కృష్ణానదీయాజమాన్యబోర్డు రెం డు రాష్ట్రాలకు ఈ దామాషాలోనే నీటి వాటాలను కేటాయి స్తూ వస్తోంది. అయితే ఈ ఒప్పందం అంగీకరించకుండా తె లంగాణ రాష్ట్రం గత రేండేళ్లుగా కృష్ణానీటిలో 50శాతం వాటా ను డిమాండ్ చేస్తూ వస్తోంది. కనీసం వచ్చే నీటిసంవత్సరం నుంచైనా కృష్ణాలో సమాన నీటి వాటా దక్కుతుందని ఆశించ గా, కృష్ణాయాజమాన్య బోర్డు నిర్లక్షవైఖరి కారణంగా ఆ అవకాశం చేజేతులా చేజారి పోతోం ది. బోర్డు సమావేశం నిర్వహించి రెండు రాష్ట్రాల మధ్య వాటాలు కుదిర్చి ఉంటే ఎన్నికల కోడ్ వచ్చినా నీటివాటాలకు సమస్య తలెత్తి ఉండేదికాదంటున్నారు. ఇప్పటో సమావేశం నిర్వహించినా కొత్తగా నిర్ణయాలు కేటాయింపులు చేసుకునే అవకాశం ఉండదని చెబుతున్నారు.
ప్రాజెక్టుల స్వాధీనంపై ఏప్రిల్ 30న సుప్రీం తీర్పు!
రాష్ట్ర విభజన చట్టం మేరకు కృష్ణానది ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ అమలు మరో వైపు తెలంగాణ పాలిట గుదిబండగా మారింది. కృష్ణానదీజాలాల్లో నీటిని తిరిగి పంపిణీ చేసేవరకూ గెజిట్ నోటిఫికేషన్ అమలు చేయరాదని తెలంగాణ కోరుతోది. గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం , నాగార్జున సాగర్ , పులిచింతల తదితర ప్రాజెక్టులన్నింటినీ కృష్ణాబోర్డుకు అప్పగించాల్సివుంది.ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఔట్‌లెట్లన్నింటీనీ బో ర్డు స్వాధీనం చేసుకుంటే ఇక పెత్తనంతా బోర్డు చేత్లుల్లోకే వెళ్లనుంది. బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ప్రకారం నీటి నిర్వహణ కొనసాగించాలని ఏపి ప్రభుత్వం వాదిస్తోంది. అంతే కా కుండు ప్రాజెక్టులను కృష్ణాబోర్డు స్వాధినం చేసుకోవాలని కో రుతూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఏప్రిల్ 30న ఈ కేసు విచారణ జరగనుంది. సుప్రీంకోర్టులో తీర్పు ఏపీకి అనుకూలంగా వెలువడితే తెలంగా ణ రాష్ట్రం మరింతగా నష్టపోవాల్సి వస్తుందంటున్నారు.
త్రిసభ్య కమిటీతోనే కాలం వెల్లదీస్తారా ..
కృష్ణానదీయాజమాన్య బోర్డు తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నీటిపారుదల శాఖల ఉన్నత స్థాయి అధికారలతో పూర్తి స్థాయి బోర్డు సమావేశం ఏర్పాటు చేయకుం డా త్రిసభ్య కమిటీతోనే కాలం వెల్లదీస్తోంది. కృష్ణానదీజలాలకు సంబంధించి ఏవైనా కొత్త ప్రతిపాదనలు వుంటే వాటిని బోర్డు సమావేశంలో చర్చిం చి రెండు రాష్ట్రాలకు ఆమోదయోగ్యమనై నిర్ణయాలు తీసుకుంటారు. బోర్డులో చేసిన నిర్ణయాలనే త్రిసభ్య కమిటీ ద్వారా అమలు చేయాల్సి వుంటుంది. అయితే బోర్డు సమావేశాలు లేకపోవటం , కొత్త నిర్ణయాలు చేయకపోవటంతో త్రిసభ్య కమిటీ కూడా పాత విధానాలు,గతంలో తీసుకున్న నిర్ణయాలనే అమలు చేయాల్సివస్తోంది.