Monday, December 23, 2024

బస్తీ దవాఖానాలకు నీటి కష్టం

- Advertisement -
- Advertisement -

రాజేంద్రనగర్ : తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బస్తీ దావఖానలతో ప్రజకు వైద్య సేవలను చేరువ చేస్తే మిగతా శాఖలు అక్కడ కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. వైద్య సిబ్బంది, రోగులలు అపరిశుభ్ర పరిసరాలలు, వాష్ రూమ్‌లలో నీటి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైద్యలు, వైద్య సిబ్బంది సైతం నీటి వసతి లేక నానాపాట్లు పడాల్సి వస్తుందంటున్నారు. రంగారెడ్డి జిల్లా కు చెందిన గ్రేటర్ హైదరాబాద్ మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌లో సమస్యలు మరింతగా మారాయని సమాచారం. పారిశుధ్య విభాగం సిబ్బంది బస్తీ దావఖానల ఆవరణలో చెత్త తరలింపుతో పాటు పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించడానికి ఉత్సాహం చూపకపోవడం ఆయా బస్తీ దావఖానలలో పని చేసే సిబ్బంది ఇబ్బందిగా, రోగులకు అసౌకర్యాలను కలిగిస్తున్నాయి. ఉదాహారణకు మార్కండేయనగర్ బస్తీ దావఖాన నర్సాబాయి కంటకు అనుకుని ఉంటుంది.

వర్షాకాలం కావడంతో కుంటలో నీటి శాతం పెరగడం, పిచ్చ మొక్కలు దావఖాన చూట్టు విఫరీతంగా పెరగడంతో పాములు, కీటకాలు తిష్టవేస్తున్నాయి. అదరిస్తే ఏమి కరుస్తాయో అన్న భయాందోళనలో రోగులు, వైద్య సిబ్బంది ఉన్నారు. దానికి తోడు కనీసం ఈ దావఖానలో నీటి వసతి లేకపోవడం చాలా సమస్యగా ఉందని తెలిసింది. దాంతో చేసేది లేక వైద్య సిబ్బంది సమీపంలోని గృహ వాసులను ఆడికి బాకెట్లతో నీటిని తెచ్చుకుని తమ విధులు కొనసాగించడం కనిపించింది. మెట్రో వాటర్ బోర్డు అధికారులు స్పందించి వెంటనే నల్లా కనెక్షన్ ఇవ్వాలని బస్తీ వాసులు కోరుతున్నారు. అలాగే పారిశుధ్య విభాగం అధికారులు స్పందించి దావఖాన పరిసరాలను శుభ్రం చేయించాలని, దుర్వాసనలు రాకుండా బ్లీచింగ్ చల్లించాలని మహిళలు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News