Monday, December 23, 2024

చెరువుల్లో నీటి నిల్వలు పర్యవేక్షించాలి

- Advertisement -
- Advertisement -

మంథని: భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. గురువారం మంథని ప్రాంతంలో పర్యటించిన ఆయన గత సంవత్సరం వరద ఉదృతి అధికంగా ఉన్న ప్రాంతాలను పరిశీలించారు. అలాగే మాతాశిశు ఆసుపత్రిని సందర్శించి, ప్రాధాన్యత ప్రకారం చేపట్టాల్సిన పనుల వివరాల నివేదిక అందజేయాలన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందేలా అవసరమైన సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

ఆసుపత్రి సమీపంలో గల డంపింగ్ యార్డును ఇతర ప్రాంతానికి తరలించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. రాబోయే మూడు, నాలుగు రోజుల్లో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, పాత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని లోతట్టు ప్రాంతాల ప్రజలకు పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి ముందస్తుగా తరలించాలని అన్నారు.

పట్టణంలోని చెరువులు, వివిధ ప్రాజెక్టుల కాల్వలు నీటి నిల్వలు ఎప్పటికప్పుడు పరిశీలించి, నిఘా ఉంచాలన్నారు. పట్టణంలో విద్యుత్ సరఫరాకు ఎలాంట అంతరాయం లేకుండా చూడాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం లేకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శారద, తహసిల్దార్ గిరిధర్, ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News