Saturday, November 23, 2024

ఈ నెల 26 నుంచి రెండు రోజుల పాటు నీటి సరఫరాకు అంతరాయం

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ,సిటీబ్యూరో: మహానగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న కృష్ణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టు ఫేజ్2కి సంబంధించిన 1600 ఎంఎం డయా పీఎస్సీ గ్రావిటీ మెయిన్ నీటి లీకేజీలను అరికట్టడానికి బాలాపూర్ రోడ్డులోని శివాజీ చౌక్ వద్ద మరమ్మత్తులు జరపాల్సి ఉంది. దీంతో పాటు బాలాపూర్ రోడ్డులోని హపీజ్‌పేట బాబానగర్ వద్ద 100 ఫీట్ల రోడ్డు విస్తరణ పనుల నిమిత్తం ఎయిర్వాల్వను పక్కకు మార్చాల్సి ఉంది. ఈ పనులు ఈ నెల 26వ తేదీ శనివారం ఉదయం 6గంటల నుంచి 27వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 12గంటలకు వరకు కొనసాగుతాయి. 30 గంటల పాటు కృష్ణ డ్రింకింగ్ వాటర్ సరఫరా ప్రాజెక్టు ఫేజ్2 కింద ఉన్న రిజర్వాయర్ల పరిధిలోని కొన్ని చోట్ల నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. మరికొన్ని చోట్ల లోప్రేషర్ నీటి సరఫరా జరుగుతుంది.

అంతరాయం ఏర్పడే ప్రాంతాలు: ఎన్పీ పరిధిలోని ప్రాంతాలతో పాటు బాలాపూర్, మైసారం, బార్కాస్ పరిధిలోని ప్రాంతాలు. డివిజన్ 20లో ఆల్మాస్‌గూడ, లెనిన్‌నగర్, బడంగ్‌పేట, ఏఆర్సీఐ పరిధిలోని ప్రాంతాలు. లో ప్రెషర్ నీరు సరఫరా అయ్యే ప్రాంతాలు ః డివిజన్ 1లో మిరాలం పరిధిలోని ప్రాంతాలు, డివిజన్ 3 బోజగుట్ట పరిధిలో ప్రాంతాలు, డివిజన్ 16 బుద్వేల్ పరిధిలో ప్రాంతాలు, డివిజన్ 20 శంషాబాద్ పరిధిలో ప్రాంతాలు ఉన్నట్లు జలమండలి పేర్కొంది. వినియోగదారులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News