హైదరాబాద్ : మహానగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న కృష్ణా ఫేస్ 2 రింగ్ మెయిన్2 నాగోల్ జంక్షన్ వద్ద ఆటో టాక్ నుంచి చర్బుజా మార్బుల్స్ వరకు గల 1600 ఎంఎం డయా ఎమ్‌ఎస్ మెయిన్ పైపులైన్‌కు జంక్షన్ పనులు చేపడుతున్నారు. దీంతో రేపు ఉదయం 6గంటల నుంచి గురువారం ఉదయం 6గంటల వరకు మొత్తం 24గంటల పాటు పనులు కొనసాగుతాయి. సందర్భంగా రిజర్వాయర్ ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని మంగళవారం వాటర్‌బోర్డు పేర్కొంది.ఆయా ప్రాంతాల వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించింది.
అంతరాయం ఏర్పడే ప్రాంతాలు
1. ఓ అండ్ ఎమ్ డివిజన్ నెం. 2 : బాలాపూర్, మైసారం, బార్కాస్
2. ఓఅండ్ ఎమ్ డివిజన్ నెం. 5 : మేకలమండి, భోలక్‌పూర్
3 ఓఅండ్ ఎమ్ డివిజన్ నెం. 7 : తార్నాక, లాలాపేట్, భౌద్దనగర్, మారేడుపల్లి, కంట్రోల్ రూమ్, రైల్వేస్, ఎమ్‌ఈఎస్,
కంటోన్మెంట్, ప్రకాష్‌నగర్, పాటిగడ్డ.
4 ఓఅండ్ ఎమ్ డివిజన్ నెం 9 : హస్మత్‌పేట్, ఫిరోజ్‌గూడ, గౌతమ్‌నగర్
5. ఓఅండ్ ఎమ్ డివిజన్ నెం. 10 : వైశాలినగర్, బిఎన్‌రెడ్డినగర్, వనస్దలిపురం, ఆటోనగర్, మారుతినగర్
6. ఓఅండ్ ఎమ్ డివిజన్ నెం. 13 : మహింద్రహిల్స్
7. ఓ అండ్ ఎమ్ డివిజన్ నెం. 14 : ఏలుగుట్ట, రామంతపూర్, ఉప్పల్, నాచారం, హబ్సిగూడ, చిలుకనగర్, బీరప్పగడ్డ
8. ఓఅండ్ ఎమ్ డివిజన్ నెం 19 : బోడుప్పల్‌లోని కొన్ని ప్రాంతాలు
9. ఓఅండ్ ఎమ్ డివిజన్ నెం. 20 : మీర్‌పేట, బడంగ్‌పేట,శంషాబాద్