Monday, January 20, 2025

నగరంలోని పలు ప్రాంతాల్లో మూడు రోజుల పాటు నీటి సరఫరా నిలిపివేత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగర శివారులోని కొన్ని ప్రాంతాల్లో మూడు రోజుల పాటు నీటి సరఫరా నిలిచిపోనుంది. సిద్ధిపేట జిల్లా కుకునూర్‌పల్లి వద్ద రైల్వే ట్రాక్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పనులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు… కొండపాక నుంచి హైదరాబాద్‌ నగరానికి మంచినీళ్లు సరఫరా చేస్తున్న 3000 ఎంఎం డయా ఎంఎస్‌ మెయిన్‌ పైపులైన్‌ను పక్కకు మార్చనున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 8 నుంచి 10వ తేదీ వరకు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని జలమండలి అధికారులు వెల్లడించారు.

మార్చి 8న ఉదయం 6 గంటల నుంచి 10 అర్ధరాత్రి 12 గంటల వరకు దాదాపు 66 గంటల పాటు నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు. అంతరాయాన్ని మన్నించి నీటిని పొదుపుగా వాడుకోవాలని నగర ప్రజలకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు సూచించింది. హైదరబాద్ శివారులోని షాపూర్‌, చింతల్‌, జీడిమెట్ల, వాణి కెమికల్స్‌, గాజుల రామారం, జగద్గిరిగుట్ట, సూరారం, మల్కాజిగిరి డిఫెన్స్‌ కాలనీ, దమ్మాయిగూడ, నాగారం, కొంపల్లి, కీసర, బొల్లారం, గుండ్ల పోచంపల్లి, ఘన్‌పూర్‌ (మేడ్చల్‌/శామీర్‌పేట), కంటోన్మెంట్‌ ప్రాంతం, ఎంఈఎస్‌, తుర్కపల్లి బయోటెక్‌ పార్కు, కాప్రా మున్సిపాలిటీ పరిధితో పాటు కొండపాక, ప్రజ్ఞాపూర్‌, ఆలేరు ప్రాంతాల్లో మూడు రోజుల పాటు నీటి సరఫరా నిలిచిపోనుంది.

ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష : జలమండలి ప్రధాన కార్యాలయంలో నీటి సరఫరా అంతరాయం ఏర్పడే డివిజన్ల సీజీఎం, జీఎంలతో ఎండీ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ముందుగా 66 గంటలు పనులు జరుగుతాయనుకున్నప్పటికి వాటిని 48 గంటలో పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభావితమయ్యే ప్రాంతాల్లో 10వ తేదీన ఎట్టి పరిస్థితుల్లో నీరు సరఫరా అయ్యేలా చూడాలని, అప్పటివరకు ఆప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని, మరమ్మత్తుల కారణంగా నగరంలో దాదాపు 2.5లక్షల కనెక్షన్లకు నీటి సరఫరా అంతరాయం కలుగుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News