Monday, January 20, 2025

దళిత మహిళ నీళ్లు తాగినందుకు గోమూత్రంతో ట్యాంక్ శుభ్రం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : ఓ దళిత మహిళ నీళ్లు తాగినందుకు ట్యాంకర్‌ను గోమూత్రంతో శుభ్రం చేశారు. ఈ ఘటన కర్ణాటక లోని చామరాజనగర్ జిల్లా హెగ్గొతార గ్రామంలో జరిగింది. ట్యాప్ ద్వారా ఆ దళిత మహిళ నీళ్లు తాగినట్టు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ ప్రాంతంలో ఉండే ఉన్నత కులాలకు చెందిన వాళ్లు ఆ ట్యాంక్‌లో ఉన్న నీటిని ఖాళీ చేయించి దాన్ని శుభ్రం చేశారు.

ట్యాంక్‌ను శుభ్రం చేసింది నిజమే కానీ దాన్ని గోమూత్రంతో కడిగారా లేదా అన్న విషయం తనకు తెలియదని స్థానిక తహశీల్దార్ బసవరాజ్ తెలిపారు. కానీ ఆ ట్యాంక్ వద్ద నీళ్లు తాగిన మహిళను ఇప్పటివరకు ఎవరూ గుర్తించలేదని చెప్పారు. ఆ మహిళను గుర్తించాక కేసు నమోదు చేస్తామన్నారు. గ్రామంలో చాలా ట్యాంక్‌లు ఉన్నాయని అందరూ నీళ్లు తాగవచ్చని ఆ ట్యాంక్‌లపై రాసి ఉంటుందని ఆయన చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News