Monday, December 23, 2024

వాటర్ ట్యాంకర్ ఢీకొని యువతి మృతి

- Advertisement -
- Advertisement -

ఎర్రగడ్డ ఫ్లైఓవర్‌పై సంఘటన

మనతెలంగాణ, సిటిబ్యూరోః వాటర్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ఓ యువతి అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన ఎర్రగడ్డ ఫ్లైఓవర్‌పై గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… ఎపిలోని కర్నూలు జిల్లా శ్రీశైలానికి చెందిన సునీత నగరంలో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలోనే కూకట్‌పల్లి నుంచి ఆఫీస్‌కు వెళ్లేందుకు బైక్‌పై ఎర్రగడ్డవైపు వెళ్తోంది. ఓ వాటర్ ట్యాంకర్ దూసుకువచ్చి సునీత బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది.

దీంతో కింద పడిపోయిన సునీతపై నుంచి వెనుక నుంచి వస్తున్న ఆర్టిసి బస్సు వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందింది. దీంతో వాహనాలను ఎక్కడి వక్కడ నిలిచిపోవడంతో ట్రాఫిక్ పోలీసులు వచ్చి క్లియర్ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News