Monday, December 23, 2024

తెలంగాణ వొస్తే ఏమొచ్చింది అంటున్న నాయకులు… ఢిల్లీలో కాదు.. కూడవెల్లి వాగులో చూడండి

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట/తొగుట: ఆలుపెరుగని కర్తవ్య దీక్ష దక్షతతోనే నాడు తెలంగాణ సాధించిన సీఎం కేసీఆర్ నేడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పంటపొలాలకు గోదావరి నీళ్లను అందిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని తుక్కాపూర్లో గల కాళేశ్వరం ప్రాజెక్టు 12వ ప్యాకేజీ నుండి మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్రెడ్డితో కలిసి శుక్రవారం మల్లన్న సాగర్ ప్రధాన కాలువకు నీళ్లను విడిచారు. ప్రత్యేక రాష్ట్రపలితమే నేడు మనం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గండు కరువులో గోదావరి జలాలను చెరువు, కుంటల్లోకి విడుచుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఒకప్పుడు కరువు, కాటకాలతో కొట్టు మిట్టాడుతున్న తెలంగాణ ప్రాంతం, దుబ్బాక ప్రాంతం నేడు గోదావరి జలాలతో సస్యశ్యామలం అవుతుంటే ఓర్వలేకనే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరాకు నీళ్లు రాలేవంటున్న ప్రతిపక్ష నాయకులు కూడవెల్లి వాగులో పారుతున్న గోదావరి జలాలను చూసి మాట్లాడాలన్నారు.

నోరు తెరిస్తే అబద్దాలు మాట్లాడే ప్రతిపక్ష నాయకులు నేడు గోదావరి జలాలతో సస్యశ్యామలం అవుతుంటే ఓర్వలేకనే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరాకు నీళ్లు రాలేవంటున్న ప్రతిపక్ష నాయకులు కూడవెల్లి వాగులో పారుతున్న గోదావరి జలాలను చూసి మాట్లాడాలన్నారు. నోరు తెరిస్తే అబద్దాలు మాట్లాడే ప్రతిపక్ష నాయకులు వాస్తవాలు తెలుసుకోవాలని, ఆవాస్తవాలు మాట్లాడితే ప్రజల్లో ఉన్న కాస్త విశ్వసనీయత పోతుందన్నారు. పారుతున్న నీళ్లు, నిండుతున్న చెరువులు, పొంగుతున్న వాగులు వారి కళ్లకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. శుభమా అని కరువు ప్రాంతాల్లో గోదావరి జలాల ద్వారా సస్యశ్యామలం అవుతుంటే విమర్శలు చేయడం హేయనీయమన్నారు. గ్లోబల్స్ ప్రచారాన్ని ప్రజలు నమ్మారని, ఇప్పటికైనా ప్రతిపక్షాలు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. 12వ ప్యాకేజీ ద్వారా దుబ్బాక, సిద్ధిపేట, సిరిసిల్లా నియోజకవర్గాలలో 125000 ఎకరాలకు సాగు నీరు అందించడం జరుగుతుందన్నారు.

కాలువ కింద 257 చెరువు, కుంటలు ఉండగా, 91 చెరువు కుంటలకు మాత్రమే నీళ్లు విడుదల చేస్తున్నామని, మిగతా చెరువు, కుంటల్లోకి కాలువల నిర్మాణం కోసం ప్రజా ప్రతినిధులు సహకరిచాలని ఆయన కోరారు. నాడు కరువు కాటకాలతో కూడవెల్లి బాగు వర్షాకాలంలో కూడా ఎండిపోయేదని, నేడు సీఎం కేసీఆర్ చొరవతో జీవనదిగా మారిందన్నారు. మొన్ననే మన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కూడవెల్లికి, హల్దిబాగులోకి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నుండి నీళ్లను విడుదల చేయడం జరిగిందన్నారు. నేడు కూడవెల్లి నీటి ప్రవాహంతో పండుగ వాతావరణం నెలకొందన్నారు. గతంలొ ఒక్క బోరులో దో ఇంచ్ నీళ్లు నడితే పెద్ద పండుగ చేసుకునే వాల్లు, యాటను కొసుకొని దావతే చేసుకునే వాళ్లు, అట్లాంటిది గోదావరి నీళ్లను మలిపిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఇది తెలంగాణ సాధించిన విజయం, తెలంగాణ రాకుంటే కాళేశ్వరం చూసే వారమా. 80 ఏళ్ల సమైఖ్యాంధ్ర పాలనలో చిన్న కాలువ, చెరువు అయినా తద్వారా ప్రభుత్వం రైతుల కోసం రూ.25 యూనిట్ లెక్క కొనుగోలు చేసి రైతులకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నాం.

కరెంటు మీద ఏడాదికి రూ. 50 వేల కోట్లు, రైతు బంధు కోసం రూ. 80 వేల కోట్లు, రైతు బీమా కోసం రూ.5900 కోట్లు, చెక్ డ్యాంల నిర్మాణం కోసం రూ. 2000 కోట్లు ఖర్చు చేస్తు రైతు సంక్షేమానికి పెద్దపీఠ వేస్తున్నామని ఆయన తెలిపారు.తెలంగాణ దుబ్బాక పక్కనుండి సార్ చదువుకున్న పాఠశాల నుండి గోదావరి నీళ్లు వెల్లాలని నేడు నీళను విడవడం. జరిగిందన్నారు.. రైతు భరోసా, గౌరవం పెరిగింది అంటే కేసీఆర్ పుణ్యమే. నీళ్లను జాగ్రత్తగా, కరెంటును వాడుకోవాలని, కరెంటు, నీళ్లు లేనినాడు ఎన్ని కష్టాలు పడ్డామో మీకు తెలుసు కాబట్టి నీటిని, విద్యుత్ను ఆదాచేయాలన్నారు. సీఎం కేసీఆర్ గారి జన్మదినోత్సవం సందర్భంగా సార్ చదువుకున్న దుబ్బాక పాఠశాల పక్క నుండి గోదావరి జలాలను పారించడానికి నేడు నీళ్లను విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలతో పాటు యావత్ భారత దేశ ప్రజల ఆశీర్వాదంతో ఆయుఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఆనంతరం ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి కేక్ కట్ చేసి సీఎం కేసీఆర్ జన్మదినోత్సవ వేడుకల్లో మంత్రి తన్నీరు హరీశావు పాల్గొన్నారు. కాలువలో గోదారమ్మకు వారు పూలు చల్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైతు పక్షపాతి సీఎం కేసీఆర్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి

సీఎం కేసీఆర్కు రైతులంటే ఎంతో ప్రేమని, రైతుల సంక్షేమం కోసం ఆహర్నిషలు కృషి చేస్తున్నాడని మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో ఏ ప్రభుత్వం రైతుల కోసం పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా గోదావరి జలాలను దుబ్బాక కాలువలోకి విడవడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. సీఎం కేసీఆర్ ఆశిస్సులతోనే రాష్ట్రం అంతటా తాగు, సాగునీరు అందుబాటులోకి రావడం జరిగిందన్నారు. ఈకాలువ ద్వారా దుబ్బాక నియోజకవర్గంతో పాటు సిద్దిపేట, సిరిసిల్లా రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. పంట పొలాలు ఎండి పోతున్నాయని నీళ్లను విడిచి కాపాడాలని రైతులు విజ్ఞప్తి చేయగా నేడు సీఎం కేసీఆర్, మంత్రి తన్నీరు హరీశ్రావు ఆశిస్సులతో నేడు నీటిని విడుదల చేసుకుంటున్నామని ఆయన తెలిపారు.

కార్యక్రమంలో కాళేశ్వరం ఈఎన్సీ హరిరాం, జడ్పీ చైర్మన్ వేలేటి రోజా శర్మ, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, నీటిపారుదల శాఖ ఎస్ఈ భస్వరాజ్, ఈఈ సాయిబాబా, సూడా చైర్మన్ మారెడ్డి రవిందర్ రెడ్డి, జిల్లా నాయకులు రొట్టె రాజమౌళి, వెంకటనర్సింహ్మారెడ్డి, బక్కి వెంకటయ్య, జడ్పీటీసీ కడతల రవీందర్రెడ్డి, ఎంపీపీ గజ్జెల స్థాయిలు, ఆత్మకమిటీ చైర్మన్ భాస్కరాచారి, వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి,. సొసైటీ చైర్మన్ . హరికృష్ణరెడ్డి. మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ ఛైర్మన్ దోమల కొమురయ్య, కంది రాంరెడ్డి. మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి, రైతు బంధు ఆధ్యక్షులు కనకయ్య, కోఆప్షన్ సభ్యులు ఎండీ కలీమోద్దీన్, సర్పంచ్లు సిరినేని గోవర్ధన్రెడ్డి, చంద్రం, మల్లయ్య, బొడ్డు నర్సింహులు, ఎంపీటీసీలు వెల్పుల స్వామి, కొమ్ము శరత్, నాయకులు చిలువేరి రాంరెడ్డి, కుంభాల శ్రీనివాస్, చిలువేరి మల్లారెడ్డి, కుంభం రఘోత్తంరెడ్డి, శ్రీశైలం మంగ నర్సింహులు, సుతారి రమేష్, బక్క కనకయ్య, ఐలయ్య, మల్లేశం, బిక్షపతి, సంతోష్, సురేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, అరుణ్, అనిల్, వికాస్, రమేష్, బాలరాజు, స్వామి, రాజు, . పర్శరాములు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News