Wednesday, January 15, 2025

తమిళనాడులో భారీ వర్షాలు.. పొంగిపొర్లుతున్న జలపాతాలు

- Advertisement -
- Advertisement -

కుండపోత వర్షాలు తమినాడు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. గత మూడు నాలుగు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో వరదలు పలు ప్రాంతాలను ముంచెత్తాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. పలు కాలనీలు నీట మునిగాయి. పలు ఇల్లు ధ్వంసమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వర్షాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా, బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం కారణంగా మరో 48 గంటల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం(ఐఎండీ) హెచ్చరించింది. చెన్నై, మధురై, సేలం సహా 10 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్రంలోని 10 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది. దీంతో అప్రమత్తమైన తమినాడు ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది.

మరోవైపు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జలపాతాలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పర్యాటకులకు అనుమతి నిషేధించింది ప్రభుత్వం. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు అలర్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News