Wednesday, January 22, 2025

ట్రాకులపై వరద నీరు: వందలాది రైళ్లు రద్దు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: గత శనివారం నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రైలు ట్రాకులపై వరద నీరు చేరుకోవడంతో జులై 7 నుంచి జులై 15 వరకు 300కు పైగా మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 406 పాసింజర్ రైళ్లు రద్దయినట్లు రైల్వే అధికారులు గురువారం తెలిపారు. ట్రాకులు నీటిలో మునిగిపోయిన కారణంగా మొత్తమ్మీద దాదాపు 600 మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 500కు పైగా పాసింజర రైళ్లు నిలిచిపోయినట్లు వారు చెప్పారు.

గత శనివారం నుంచి వాయువ్య భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జమ్మూ కశ్మీరు, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్‌లో రికార్డు స్థాయిలో కుంభవృష్టి కురుస్తోంది. ఈ కారణంగా నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతూ మౌలిక సౌకర్యాలకు ధ్వంసం చేయడంతోపాటు జమ్మూ కశ్మీరు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్‌లో అత్యవసర సర్వీసులకు అంతరాయం కల్పించాయి. ఉత్తర రైల్వే పరిధిలోకి వచ్చే ఈ రాష్ట్రాలలో దాదాపు 300 మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు కాగా, 100 రైళ్లు స్వల్పదూరానికే పరిమితమయ్యాయి. దాదాపు 191 రైళ్ల దారి మళ్లింపు జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News