Wednesday, January 22, 2025

కరుణాకర్‌ రెడ్డికి వాటర్‌మ్యాన్‌ అఫ్ సౌత్ ఇండియా అవార్డు

- Advertisement -
- Advertisement -

Waterman of South India Award to Karunakar Reddy

హైదరాబాద్‌: మురుగునీటి శుద్ధి, సామాజిక నీటి శుద్ధి ప్లాంట్లతో దేశంలో వేలాది గ్రామాల్లో ప్రజల దాహార్తి తీరుస్తూ జల ప్రదాతగా గుర్తింపు పొందిన ఎం. కరుణాకర్‌ రెడ్డిని మరో ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. మహారాష్ట్ర ముంబై కి చెందిన ప్రసిద్ధ గ్రీన్ మాపెల్ ఫౌండేషన్ సంస్థ… దక్షిణ భారత వాటర్‌మ్యాన్‌ పురస్కారంతో ఈనెల 16న ముంబైలో జరిగే కార్యక్రమంలో సత్కరించనుంది. స్మాట్‌ ఇండియా కంపెనీ ద్వారా దేశంలో 14 వేలకి పైగా కమ్యూనిటీ నీటి శుద్ధి ప్లాంట్లు నెలకొల్పి నిత్యం కోట్లాది లీటర్ల సురక్షిత శుద్ధ జలాలను అందించడంతో పాటు వాక్‌ ఫర్‌ వాటర్‌ సంస్థ ద్వారా పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌, కశ్మీర్‌, కేరళ, ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలలో విపత్తుల వేళ సంచార నీటి శుద్ధి కేంద్రాలతో బాధితులకు తాగునీరు అందిస్తున్నారు. మరోవైపు నీటి సంరక్షణకోసం ఇంకుడు గుంతల నిర్మాణం వంటి కార్యకమాలతో జల, పర్యావరణ రంగాలలో చేస్తున్న విశేష కృషికిగాను కరుణాకర్‌రెడ్డిని వ్యాటర్‌ మ్యాన్‌ అఫ్ సౌత్‌ ఇండియా అవార్డుకు ఎంపిక చేసినట్లు ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇప్పటి వరకు 250కిపైగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్న తనని.. సౌత్‌ ఇండియా వాటర్‌మ్యాన్‌ అవార్డుకి ఎంపిక చేయడంపట్ల కరుణాకర్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 2014, 2017లో నాటి మహారాష్ట్ర సిఎం, నేటి ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ చేతులమీదుగా ప్రైడ్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా, వాటర్‌ హీరో అవార్డులు అందుకున్నానని గుర్తు చేశారు. ప్రస్తుతం మహారాష్ట్రలోని 184 గ్రామాల్లో స్వచ్ఛ జలాలను తక్కువ ధరకే అందిస్తున్న సేవలకి గుర్తుగా ఆ రాష్ట్రానికి చెందిన సంస్థ మరోసారి అవార్డు ప్రకటించడం తన బాధత్యని మరింతగా పెంచిందన్నారు. ప్రజల ఆదరాభిమానాలు, బంధు మిత్రుల సహకారంతో… పర్యావరణ హిత, హరిత భారత కార్యక్రమాలు మున్ముందు కూడా కొనసాగిస్తానన్న కరుణాకర్‌రెడ్డి తెలిపారు. రానున్న నీటి కొరత ముప్పుని ఎదుర్కోవడానికి త్వరలో గ్రీన్‌ అవర్‌ పేరుతో వర్షం నీటి సంరక్షణ కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టనున్నట్లు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News