Tuesday, November 5, 2024

వయనాడ్ బాధితుల బ్యాంకు రుణాల మాఫీ: కేరళ బ్యాంకు

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: వయనాడ్‌లో జులై 30న సంభవించిన కొండ చరియలు విరిగిపడిన ఘటనలతో నష్టపోయిన బాధితుల రుణాలను మాఫీ చేయనున్నట్లు కేరళలోని జిల్లా సహకార బ్యాంకుల సమీకృత బ్యాంకైన కేరళ బ్యాంకు సోమవారం ప్రకటించిది.

చూరల్‌మల బ్రాంచ్ నుంచి రుణాలు తీసుకున్న మృతులకు చెందిన రుణాలతోపాటు తమ ఇళ్లు, ఆస్తులు పూచీకత్తుగా పెట్టి రుణాలు పొందిన బాధితుల రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించుకున్నట్లు బ్యాంకు యాజమాన్యం ప్రకటించింది. కేరళ బ్యాంకు ఇప్పటికే ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధి కోసం రూ. 50 లక్షలను విరాళంగా అందచేసింది. దీంతోపాటు బ్యాంకు ఉద్యోగులు తమ ఐదు రోజుల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ప్రకటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News