Monday, October 21, 2024

గాంధీ కుటుంబానికి వయనాడ్ కేవలం ‘రెండో సీటు’

- Advertisement -
- Advertisement -

ఎన్‌డిఎ అభ్యర్థి నవ్య హరిదాస్ ఆరోపణ
గాంధీ కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ టిక్కెట్లు ఇస్తోంది

తిరువనంతపురం : కేరళలోని పర్వత నియోజకవర్గం వయనాడ్‌ను గాంధీ కుటుంబం కేవలం ‘ఎంపిక’ లేదా ‘రెండవ సీటు’గా పరిగణిస్తోందని. ఈ సెగ్మెంట్ ప్రజలు ఈ విషయాన్ని ఇప్పుడు గ్రహించారని వయనాడ్ లోక్‌సభ ఎన్నికలకు ఎన్‌డిఎ అభ్యర్థి నవ్య హరిదాస్ ఆదివారం ఆరోపించారు. కోజికోడ్ కార్పొరేషన్‌లో రెండు సార్లు కౌన్సిలర్ అయిన నవ్య హరిదాస్ కోజికోడ్‌లో విలేకరులతో మాట్లాడుతూ, వయనాడ్ వోటర్లు కోరుకునేది ఏమిటంటే తమకు మద్దతుగా నిలచి తమ సమస్యలను పరిష్కరించాలన్నది అని చెప్పారు. ‘గాంధీ కుటుంబ ప్రతినిధిగా ప్రియాంక వస్తున్నారు.

పార్లమెంట్‌లో వయనాద్ సమస్యలను లేవదీయడంలో గాంధీ కుటుంబం విఫలమైంది’ అని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబ సభ్యులకు టిక్కెట్లు ఇస్తోందని కూడా రాజకీయ నేతగా మారిన టెకీ నవ్య హరిదాస్ విమర్శించారు. వచ్చే ఐదు సంవత్సరాల పాటు తమతో ఉంటారనే నమ్మకంతో వయనాడ్ ప్రజలు రాహుల్ గాంధీకి అనుకూలంగా తీర్పు ఇచ్చారని, కానీ రాయబరేలిని నిలుపుకునే అవకాశం లభించినప్పుడు రాహుల్ వయనాడ్ నియోజకవర్గాన్ని వదలివేశారని ఆమె అన్నారు. దీనితో ఈ నియోజకవర్గం (గాంధీ కుటుంబం) కేవలం ‘రెండవ సీటు’గా లేదా ‘ఎంపిక’గా పరిగణిస్తున్నట్లు వయనాడ్ ప్రజలు ఇప్పుడు గ్రహించారని హరిదాస్ చెప్పారు.

తన అభ్యర్థిత్వం ఆశ్చర్యకరమైనదని హరిదాస్ పేర్కొంటూ, నవంబర్ 13 ఎన్నికల్లో వయనాడ్‌లో పార్టీ వోట్ల వాటా పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. వివిధ రాష్ట్రాల్లో రానున్న ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థుల జాబితాను బిజెపి శనివారం విడుదల చేయగా కాషాయ పార్టీలో యువ మహిళా నేత అయిన నవ్య హరిదాస్‌ను ఈ కీలక స్థానానికి పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. హరిదాస్ కార్పొరేషన్‌లో బిజెపి పార్లమెంటరీ పార్టీ నాయకురాలుగా ఉన్నారు, ఆమె మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా అని పార్టీ వర్గాలు తెలియజేశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News