Monday, December 23, 2024

కేరళ వయనాడ్ స్థానం ఖాళీ.. లోక్‌సభ సచివాలయం ప్రకటన

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానం ఇప్పుడు ఖాళీ అయింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ స్థానం నుంచి ఎంపిగా ఉన్నారు. సూరత్ కోర్టు ఆయనకు జైలు శిక్ష విధించడం, వెంటనే ఆయన ఎంపి సీటుపై వేటు పడిన నేపథ్యంలో వయనాడ్ లోక్‌సభ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటన వెలువడింది. ఈ మేరకు లోక్‌సభ సచివాలయం నుంచి ఓ అధికారిక ప్రకటన వెలువరించారు.

లోక్‌సభ వెబ్‌సైట్‌లో ఇప్పుడు ఖాళీ అయిన ఎంపి స్థానాలలో జలంధర్ , లక్షద్వీప్, వయనాడ్ నియోజకవర్గాల పేర్లు దర్శనమిచ్చాయి. కాంగ్రెస్ ఎంపి సంతోఖ్ సింగ్ చౌదరి మరణంతో జలంధర్ స్థానం ఖాళీ అయింది. ఇక లక్షద్వీప్ ఎంపి అయిన ఫైజల్ ఓ హత్యాయత్నం కేసులో దోషి కావడం, అనర్హతకు గురి కావడంతో ఖాళీ భర్తీ కావల్సి ఉంది. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వయనాడ్ స్థానం కూడా ఈ భర్తీ చేయాల్సిన స్థానాల జాబితాలో నిలిచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News