Saturday, November 9, 2024

ఇది సీక్రెట్ ఆపరేషన్ అని డ్రైవర్‌కు వాజే చెప్పారు

- Advertisement -
- Advertisement -

Waze told driver that it was secret operation:NIA

అంబానీ కేసు చార్జిషీటులో పేర్కొన్న ఎన్‌ఐఎ

న్యూఢిల్లీ : రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ నివాసం ఎదుట పేలుడు పదార్థాలతో కూడిన వాహనం నిలిపివేత కేసులో డ్రైవర్ వాంగ్మూలాన్ని ఎన్‌ఐఐ ఛార్జిషీటులో నమోదు చేసింది. ఇది సీక్రెట్ ఆపరేషన్ అని డ్రైవర్‌కు ఇన్‌స్పెక్టర్ వాజే చెప్పారని పేర్కొంది. స్పెషల్ కోర్టు ముందు గత వారం ఎన్‌ఐఎ (నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ) దాఖలు చేసింది. ఫిబ్రవరి 24 25 రాత్రి అంబానీ ఇంటి ఎదుట పేలుడు పదార్ధాల వాహనం నిలిపి ఉంచడం వరకు జరిగిన సంఘటనలన్నీ డ్రైవర్ వివరించారని ఎన్‌ఐఎ ఛార్జిషీటులో పేర్కొంది. ఫిబ్రవరి 24 ఛార్జిషీటులో డ్రైవర్ వాంగ్మూలం ఈ విధంగా నమోదైంది. సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో తాను జ్ఞానేశ్వరి బంగళాకు వాజేను తీసుకు వెళ్లాను. అప్పటి మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ అధికారిక నివాసం జ్ఞానేశ్వరి బంగ్లా. ఆ బంగ్లా లోకి వాజే ఒక్కరే వెళ్లారు.

గంట తరువాత తిరిగి బయటకు వచ్చారు. బాంబులతో ఉన్న మహీంద్రా స్కార్పియో నెంబర్ ప్లేట్లను మార్చమని వాజే తనకు చెప్పారు. ఆతరువాత ఆ వాహనాన్ని అంబానీ ఇంటి ముందు ఉంచడమైంది. ప్రత్యేక మైన రూట్లలో వెళ్లి టోల్‌ప్లాజాల వద్ద టోల్ చెల్లించాలని వాజే చెప్పారు. ఆయనను అనుసరిస్తూ ఇన్నోవా కారులో నేను వెళ్లాను తెల్లవారు జాము 2.10 గంటల సమయంలో వాజే చాలా మెల్లగా కార్మికేట్ రోడ్ మీదుగా డ్రైవ్ చేస్తూ ఒకచోట వాజే స్కార్పియో ఆపి రోడ్డుకు ఎడమ పక్కన పార్కు చేశారు. నేను కూడా ఇన్నోవా కారును స్కార్పియో వెనుక 40 50 మీటర్ల దూరంలో ఆపాను. ఐదు నిముషాల తరువాత ఇన్నోవా కారులో తిరిగి వచ్చి ఫేస్ మాస్క్, షీల్డ్ తీసివేశాను. వాజే తన ఇడెంటిటీ కార్డు పోగొట్టుకున్నారు. కారులో వెతికినా కనిపించలేదు. అని డ్రైవర్ తన వాంగ్మూలం ఇచ్చినట్టు ఛార్జిషీటులో ఎన్‌ఐఎ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News