- Advertisement -
న్యూఢిల్లీ: రానున్న పంచాయతీ ఎన్నికలలో కేంద్ర దళాలను మోహరించడానికి సంబంధించి కలకత్తా హైకోర్టు జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ శనివారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
కాగా..పంచాయీ ఎన్నికలకు సంబంధించిన అంశాలను చర్చించేందుకు పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంది బెన్ శనివారం మధ్యాహ్నం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ సిన్హాను పిలిచారు. పశ్చిమ బెంగాల్‌లో జులై 8న పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. జులై 11న ఫలితాలు వెలువడతాయి.
- Advertisement -