ఢిల్లీ: ఐసిసి వన్డే ప్రపంచకప్ 2023 లీగ్ దశలో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆఫ్గానిస్తాన్ బ్యాట్స్ మెన్లు నిలకడగా ఆడుతున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఆఫ్గాన్ 63 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి ఒత్తిడి పడింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన హష్మతుల్లా షాహిది, అజ్మతుల్లాలు మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడుతూ, చెత్త బంతులను బౌండరీకి తరలిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.
ఈ క్రమంలో వీరిద్దరూ అర్థ శతకాలు పూర్తి చేసుకున్నారు. అయితే, దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించి హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో అజ్మతుల్లా(62) వెనుదిరిగాడు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 121 పరుగుల భారీ భాగస్వామ్యం అందించి జట్టను పటిష్ట స్థితిలో నిలిపారు. ప్రస్తుతం ఆఫ్గాన్ 38 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. క్రీజులో హష్మతుల్లా(61), మహ్మద్ నబీ(4)లు ఉన్నారు.