Saturday, December 21, 2024

ఓపెనర్లుగా గిల్, రోహిత్ దిగే ఛాన్స్ లేదు

- Advertisement -
- Advertisement -

ముంబై: భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌కు సంబంధించిన అధికారిక షెడ్యూల్ మంగళవారం విడుదలైన విషయం తెలిసిందే. దీంతో ఈ మెగా టోర్నమెంట్‌కు సంబంధించిన చర్చలు కూడా మొదలయ్యాయి. ఇప్పటికే మాజీ క్రికెటర్లు ప్రపంచకప్‌పై విశ్లేషణలు చేయడం మొదలు పెట్టారు. తాజాగా టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి కూడా ప్రపంచకప్ జట్టు కూర్పుపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఈ వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మతో కలిసి శుభ్‌మన్ గిల్ ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశం లేదని స్పష్టం చేశాడు.

ప్రస్తుత పరిస్థితులను పరిణలోకి తీసుకుంటే రోహిత్, గిల్‌లు కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించడం కష్టమేనన్నాడు. రోహిత్, గిల్‌లు ఇద్దరు కుడిచేతివాటం బ్యాటర్లే కావడంతో ఈ జంట ఓపెనింగ్ చేసే అవకాశం లేదన్నాడు. వరల్డ్‌కప్‌కు ముందు టీమిండియా పలు వన్డే సిరీస్‌లు ఆడనున్న నేపథ్యంలో ఇప్పుడే ఓపెనింగ్ జంట గురించి అంచనాకు రావడం సరికాదన్నాడు. కాగా, వరల్డ్‌కప్‌లో గిల్‌తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు ఆకాశ్ చోప్రా, సంజయ్ మంజ్రేకర్ తదితరులు అభిప్రాయపడిన విషయం తెలిసిందే. దీనిపై రవిశాస్త్రి ఈ విధంగా స్పందించాడు.

Also Read: లియాన్ అరుదైన రికార్డు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News