Friday, November 15, 2024

గతమెంతో ఘనం..

- Advertisement -
- Advertisement -

దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ప్రపంచ క్రికెట్‌ను శాసించిన వెస్టిండీస్ పేలవమైన ప్రదర్శనతో అట్టడుగు స్థానానికి పడిపోయింది. తొలి రెండు వన్డే ప్రపంచకప్‌లలో ట్రోఫీలను సాధించి మూడో టోర్నమెంట్‌లో రన్నరప్‌గా నిలిచిన వెస్టిండీస్ ప్రస్తుతం మెగా టోర్నీకి అర్హత సాధించడంలో కూడా విఫలమైంది. దీన్ని బట్టి విండీస్ ఏ స్థాయికి దిగజారి పోయిందో ఊహించుకోవచ్చు. గార్డెన్ గ్రీనిడ్జ్, డెస్మండ్ హెయిన్స్, క్లైవ్ లాయిడ్స్, గారీ సోబర్స్, మాల్కం మార్షల్, వివిఎన్ రిచర్డ్, గాసెన్ లోగి, రిచి రిచర్డ్‌సన్, బ్రియాన్ లారా, అంబ్రోస్, హూపర్, వాల్ష్, బెంజిమన్, చంద్రపాల్, క్రిస్ గేల్, బ్రావో వంటి దిగ్గజాలతో ప్రపంచ క్రికెట్‌లో ఎదురులేని శక్తిగా కొనసాగిన విండీస్ నేడు అనామక జట్టుగా మారిపోయింది.

విండీస్ క్రికెట్ బోర్డు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో కరీబియన్ టీమ్ పూర్తిగా బలహీనంగా తయారైంది. గతంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్ వంటి పెద్ద పెద్ద జట్లను గడగడలాడించిన విండీస్ ప్రస్తుతం జింబాబ్వే, అఫ్గానిస్థాన్, శ్రీలంక, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ వంటి చిన్న జట్ల చేతుల్లోనూ అవమానకర రీతిలో ఓటములు చవిచూస్తోంది. విండీస్‌లో ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నా వారిని సరైన విధంగా ఆ దేశ క్రికెట్ బోర్డు వినియోగించుకోవడం లేదు. దీంతో విండీస్ క్రికెట్ పూర్తిగా పతనావస్థకు చేరింది. ఇప్పటికైన దిద్దుబాటు చర్యలు తీసుకోక పోతే రానున్న రోజుల్లో విండీస్ టీమ్ పూర్తిగా కనుమరుగైనా ఆశ్యర్యం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News