Monday, January 27, 2025

‘నారీ శక్తి పురస్కార్’కు దరఖాస్తుల స్వీకరణ..

- Advertisement -
- Advertisement -

WCD Ministry invites Application for Nari Shakti Award 2021

మనతెలంగాణ/హైదరాబాద్: మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2021 సంవత్సరానికి ‘నారీ శక్తి పురస్కార్’ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దేశంలో వివిధ రంగాల్లో మహిళల సాధికారతకు, వారి అబివృద్ధికి కృషి చేసిన మహిళలకు, మహిళా సంఘాలకు ఈ జాతీయ అవార్డులు ప్రతి సంవత్సరం ఇస్తారు. 2022 మార్చి 8న జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ‘నారీ శక్తి పురస్కారాలు’ ఇవ్వడానికి మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. అర్హత ప్రమాణాలు, మార్గదర్శకాలు, ఇతర వివరాలు wcd.nic.in/acts/guidelines-nari-shakti-puraskar-2021-onwards పోర్టల్‌లో లభిస్తాయని తెలిపారు. దరఖాస్తులు/నామినేషన్లు కేవలం ఆన్‌లైన్‌లో www.awards.gov.in పోర్టల్ ద్వారా మాత్రమే పంపించాలి. ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తులు/ నామినేషన్లు సమర్పించాలి.

WCD Ministry invites Application for Nari Shakti Award 2021

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News