Monday, December 23, 2024

విద్యను కాషాయీకరిస్తే తప్పేమిటి: వెంకయ్య నాయుడు

- Advertisement -
- Advertisement -

Venkaiah Naidu
హరిద్వార్(ఉత్తరాఖండ్): తమ ‘వలసవాద మనస్తత్వాన్ని’ విడిచిపెట్టాలని భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు శనివారం దేశ ప్రజలను కోరారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75వ ఏట మెకాలే విద్యావిధానాన్ని పూర్తిగా తిరస్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో ఆంగ్ల భాషను మాధ్యమంగా పెట్టి ఉన్నత వర్గాలకే విద్యను పరిమితం చేస్తున్నారన్నారు. శతాబ్దాల వలస పాలన మనల్ని మనం తక్కువ జాతిగా భావించేలా చేసిందన్నారు. మన స్వంత సంస్కృతిని, సంప్రదాయ వివేకాన్ని తృణీకరింపజేసిందన్నారు. ఇది మన దేశ ఎదుగుదలను మందగించిందన్నారు. సమాజంలోని ఓ చిన్న వర్గం అతి పెద్ద జనాభాకు విద్యాహక్కు లేకుండా చేస్తోందన్నారు. ఆయన హరిద్వార్‌లోని దేవ్ సంస్కృతి విశ్వ విద్యాలయంలో ‘ద
సౌత్ ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పీస్ అండ్ రీకన్సిలియేషన్’కు ప్రారంభోత్సవం చేశాక తన ప్రసంగంలో ఈ విషయాలు చెప్పారు.
చదువును కాషాయీకరణ చేస్తున్నామంటూ నిందిస్తున్నారు. అయితే కాషాయరంగులో తప్పేముంది? సర్వే భవంతు సుఖినాః(అందరూ ఆనందంగా ఉండండి), వసుధైవ కుటుంబకం(ప్రపంచమంతా ఒకే కుటుంబం) అనేవి మన ప్రాచీన గ్రంథాలలో ఉన్న తత్వాలు. అవి నేటికీ భారత విదేశాంగ విధానానికి మార్గదర్శక సూత్రాలు’ అని వెంకయ్య నాయుడు అన్నారు. ‘సింధు నాగరికత ఆఫ్ఘనిస్థాన్ నుంచి గంగా మైదానాల వరకు విస్తరించింది. ఏ దేశంపైనైనా ముందుగా దాడి చేయకూడదన్న మన విధానాన్ని ప్రపంచమంతా గౌరవిస్తున్నది. ఇది యోధుల దేశం. అశోక చక్రవర్తి చివరికి హింస కంటే అహింస, శాంతి మార్గాలను ఎంచుకున్నాడు’అని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News