Wednesday, January 22, 2025

బిసి, మైనారిటీ కోటాలేని మహిళా బిల్లుకు మేము వ్యతిరేకం

- Advertisement -
- Advertisement -
స్పష్టం చేసిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ

మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం లోకసభలో ప్రవేశ పెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును ఎంఐఎం వ్యతిరేకించింది. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్‌లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. దీనిపై చర్చ కూడా మొదలైంది. ఈ బిల్లుపై లోక్‌సభలో బుధవారం చర్చ జరుగుతుంది. కాగా, ఈ బిల్లును ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యతిరేకించారు. ఓబిసి, ముస్లిం మహిళలకు రిజర్వేషన్ కల్పించని ఈ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్టు ఆయన మీడియాకు తెలిపారు. చట్టసభల్లో ప్రాతినిధ్యం లేనివారికే ప్రాతినిధ్యం కల్పించాలని ఆయనన్నారు. ముస్లిం మహిళలకు రిజర్వేషన్ కల్పించే అశం లేకపోవడమే ఈ బిల్లులో ప్రధాన లోపమని అందువల్లే తమ పార్టీ ఈ బిల్లును వ్యతిరేకిస్తోందని ఒవైసీ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News