యైటింక్లయిన్‌కాలనీ : హరితహరంలో సింగరేణి యాజమాన్యం ముందు వరుసలో ఉంటుందని ఆర్‌జి2 జిఎం అయిత మనోహర్ అన్నారు. స్వఛ్చత పక్వాడాలో భాగంగా శుక్రవారం 8వ కాలనీలోని కృష్ణవేణి ఉన్నత పాఠశాలకు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో జిఎంతో పాటు అధికారులు, ఉద్యోగులు, చిన్నారులు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు.
ఇట్టి కార్యక్రమంలో పాల్గోన్న జిఎం మాట్లాడుతూ ఇప్పటికే కాలనీల్లో, ఓపెన్‌కాస్టు ప్రాజెక్టులోన్ని ఓవర్‌బర్డెన్‌లపైన విరివిగా మొక్కలు నాటినట్టు గుర్తు చేశారు. మొక్కలు నాటే కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించడమే కాకుండా మొక్కలు సంరక్షిస్తున్నామన్నారు.
మొక్కలతో పర్యావరణ పరిరక్షణ రక్షించబడి భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించినవారం అవుతామన్నారు. గత 15 రోజులుగా గనులు, డిపార్ట్‌మెంట్లు, పాఠశాలలు, కార్యాలయాలు, కాలనీలు, డిస్పెన్సరీల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించామన్నారు.
కార్యక్రమంలో టిబిజికెఎస్ ఏరియా ఉపాధ్యక్షులు ఐలి శ్రీనివాస్, ఎస్‌ఒటుజిఎం బచ్చ రవీందర్, అధికార ప్రతినిధి జి రాజేంద్రప్రసాద్, సివిల్ ధనుంజయ, ఐఇ మురళీకృష్ణ, సెక్యూరిటి అధికారి పివి రమణ, ఎస్టేట్స్ సునీత, పర్యావరణాధికారి సురేష్‌బాబు, ఫైనాన్స్ ధనలక్ష్మిబాయి, పర్చేజ్ చంద్రరాజు, సివిల్ ఇఇ వినయ్‌సాగర్, ప్రతాపగిరి రాజు, ఫారెస్టు మేనేజర్ అభిలాష్, సీనియర్ పర్సనల్ అధికారి మండల శ్రీనివాస్, జిఎం కార్యాలయ సిబ్బంది, కృష్ణవేణి పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గోన్నారు.