Thursday, January 23, 2025

బస్వాపూరం భూ నిర్వాసితులకి మనమంతా రుణపడి ఉన్నాం

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి : మన సాగు నీటి అవసరాలు తీర్చేందుకు వారి జీవితాలు పణ్ణంగా పెట్టిన నృసింహ స్వామి రిజర్వాయర్ (బస్వాపూరం ప్రాజెక్టు) భూ బాధితులకు ( బిఎన్ తిమ్మాపురం) గ్రామస్థులకు మ్నమంతా రుణపడి ఉంటామని, రాష్ట్ర ప్రభుత్వం సైతం ఎప్పటికీ అండగా ఉంటుందని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం భువనగిరి మండలంలోని రాయిగీరి గ్రామ శివారులోని లింగబసవరెడ్డి గార్డెన్‌లో నృసింహ స్వామి రిజర్వాయర్ ( బస్వాపూరం ప్రాజెక్టు) కింద భూమి, ఇండ్లు కోల్పోయిన భువనగిరి మండలం బిఎన్ తిమ్మాపురం గ్రామ పంచాయతీకి చెందిన రైతులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద మంజూరు చేసిన పాట్ల పట్టాలను తహశీల్దార్ వెంకట్ రెడ్డి సమక్షంలో జిల్లా అదనపు కలెక్టర్ బి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి లతో కలిసి బాదితులకు పట్టాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. భూ నిర్వాసితులకు ఆదుకోవడం రాష్ట్ర ప్రభుత్వం సమిష్టి బాధ్యత అన్ని అన్నారు. తాగు సాగు నీరు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టు కోసం ఇళ్లు భూములు కోల్పోయిన నృసింహ స్వామి రిజర్వాయర్ (బస్వాపూరం ప్రాజెక్టు) కింద ముంపునకు గురైన కుటుంబాలకు అన్ని వసతు లు కల్పించనున్నట్లు తెలిపారు. ప్రతి ఎకరాకు సాగు, తాగు నీరు అందించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు.

బస్వాపూరం ప్రాజెక్టు పూర్తి అయితే రాష్ట్రంలో ఎక్కువ రిజర్వాయర్లు గల జిల్లాగా ఉమ్మడి నల్లగొండ జిల్లా నిలుస్తుందన్నారు. భువనగిరి ఆలేరు నియోజకవర్గ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ కీ భూ నిర్వాసితులకు రుణ్పడి ఉండాలని ఆయన కోరారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు, రైతుబీమా దేశానికి ఆదర్శమని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధిలో, సంక్షేమం తోపాటు రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్‌లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. పేదింటి ఆడబిడ్డ్ల పెళ్లిళ్లకు లక్ష రూపాయలు, వృద్ధులు తదితరులకు 2016, వికలాంగులకు 4016 రూపాయల పింఛన్ ఇస్తున్నామని గుర్తుచేశారు.

కార్యక్రమంలో ఆర్డీఓ భూపాల్ రెడ్డి, భువనగిరి తహశీల్దార్ వెంకటరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేందర్ రెడ్డి, రైతు సమితి అధ్యక్షులు అమరేందర్, కంచి మల్లయ్య, ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి, జడ్పీటిసి సుబ్బూరు బీరు మల్లయ్య, సర్పంచ్ లత్త రాజు, ఎంపిటిసి ఉడుత శారద ఆంజనేయులు, మాజీ పీఏసిఎస్ చైర్మన్ ఎడ్ల సత్తిరెడ్డి, మాజీ పాలసంఘం చైర్మన్ జిన్నా నరసింహా, మల్లేశం, ఎడ్ల దర్శన్ రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News