Wednesday, January 22, 2025

చిన్ననాటి మిత్రులకు మేమున్నామంటూ…

- Advertisement -
- Advertisement -
  • కష్టాల్లో ఉన్న మిత్రులకు బాసటగా నిలుస్తున్న 1997/98 పదోతరగతి బ్యాచ్
  • అనేక సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలుస్తున్న మిత్రబృందం

కోహెడ: స్నేహమంటే హాయ్.. బాయ్.. మాత్రమే కాదు.. మిత్రుడికి కష్టం వస్తే బాసట గా నిలిచేవారే నిజమైన మిత్రులని చాటి చెబుతున్నారు. కోహెడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1997-/98 పదోతరగతి బ్యాచ్‌కి చెందిన పదోతరగతి మి త్రులు. చిన్ననాటి మిత్రుడు కష్టాల్లో ఉండటం చూసి తట్టుకోలేక పోయారు. తాజాగా బొమ్మ రవీందర్ చి న్ననాటి మిత్రుడి కుమారుడికి ప్రమాదం జరుగగా.. 1997/98 బ్యాచ్ తరుపున రూ. 10 వేలను ఆర్థిక సహాయంగా సోమవారం అందజేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే… ఓ మిత్రుని కుమార్తె వివాహానికి రూ.50 వేలు, మరొక మిత్రుడు కు మార్తెకు చెవి మిష న్ కొనుగోలు కోసం రూ.50 వేలు, వర్షానికి షాప్‌లో ఉన్న వస్తువులు నష్టపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న మిత్రునికి సైతం రూ. 50 వే లు అందించి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచారు.

మరొక మిత్రుడి తండ్రి మృ తిచెందితే ఆ కుటుంబానికి రూ. 35 వేలు అం దించి చేయూతనిచ్చారు. చదువుకున్న ప్రభుత్వ బడి అభివృద్ధి కోసం తమ వంతు సహకారం అందిస్తున్నా రు. ఇందులో భాగంగా రూ. 1 లక్ష వెచ్చించి కో హెడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇలా ఎన్నో సేవా సామాజిక సే వా కార్యక్రమాలు చేస్తూ… 1997/98 పదో తరగతి మిత్రబృ ందం అందరికి ఆదర్శంగా నిలస్తుంది. మన ఆత్మీయులు కష్టాల్లో ఉన్నారంటే అటువైపు చూ సేందుకు కూడా ధైర్యం చేయని ఈ రోజుల్లో చిన్ననాటి ‘స్నేహ బంధం’ కోసం స్నేహితులంతా సాయం చేయడం అభినందనీయమని సోషల్ మీడియా వేదిక పలువురు మేధావులు, విద్యావంతులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరిన్నీ సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News