Sunday, September 8, 2024

అన్నదాతకు అగ్రస్థానం

- Advertisement -
- Advertisement -
We are committed to loan waiver of up to Rs lakh:KTR

 

రైతన్నలను గుండెలో పెట్టుకొని చూసుకుంటున్నాం

రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోరాదనే
లక్షంతోనే 2014 నుంచి రుణమాఫీ చేస్తున్నాం
అప్పట్లో రూ.లక్ష లోపు రైతు రుణాలను మాఫీ చేశాం
ఇప్పుడు కూడా రూ.లక్షవరకు మాఫీకి కట్టుబడి ఉన్నాం

మన తెలంగాణ/హైదరాబాద్ : రైతన్నలను గుండెలో పెట్టుకుని చూసుకుంటున్నామని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. అన్నదాతలను అన్నింట్లో అగ్రస్థానంలో నిలబెట్టాలన్న లక్ష్యంతో టిఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. వ్యవసాయ రంగానికి, రైతుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారన్నారు. అందువల్లే రాష్ట్రంలో పంటల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందన్నారు. ప్రస్తుతం దేశానికే అన్నం పెట్టే స్థాయికి తె లంగాణ ఎదిగిందన్నారు. అలాంటి రైతులకు రుణమాఫీ విషయంలో ఇచ్చిన హామని నూటికి నూరు శాతం నిలబెట్టుకుని తీరుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ట్వీట్ చేశారు. అన్నదాతలు అప్పుల ఊబిలో చిక్కుకోకూడదన్న లక్ష్యంతో 2014లో రూ.లక్షలోపు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేసినట్టు ఆయన తెలిపారు. ఆ సంవత్సరంలో లక్షలోపు రైతుల రుణాలను మాఫీ చేశామన్నారు. దీని వల్ల 35.19 లక్షల మంది రైతులకు రూ.16,144 కోట్ల మేరకు రైతు రుణాలను మాఫీ చేశామని వివరించారు.

2018లోనూ ఇచ్చిన హామీ మేరకు అదే నిబద్ధతతో రుణమాఫీ అమలు చేస్తున్నామన్నారు. అలాగే కరోనా సమయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం వాగ్దానాన్ని నిలబెట్టుకుందని మంత్రి కెటిఆర్ వివరించారు. రైతుల శ్రేయస్సు పట్ల ప్రభుత్వం నిబద్ధతతో ఉందన్నారు.అప్పులు లేని రైతులుగా చూడాలన్నదే టిఆర్‌ఎస్ ప్రభుత్వ సంకల్పమని ఆయన వెల్లడించారు. రూ.లక్ష వరకు రైతు రుణాలు మాఫీ చేయడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. దశల వారిగా అమలు చేస్తున్నామన్నారు. మొదటి విడతలో రూ. 25వేల వకు రుణామాఫీ చేయగా ప్రస్తుతం రెండవ విడతగా రూ.50 వేల వరకు రుణమాఫీ ఇస్తున్నామన్నారు. తద్వారా 9 లక్షల మంది రైతులకు సాయం అందిందన్నారు. కాగా రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రికి, వ్యవసాయ శాఖ మంత్రికి ఈ సందర్భంగా కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు. 2014లో . భవిష్యత్‌లనూ ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తామన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అంటే గాలి మాటలు చెప్పేది కాదని…నిబద్ధతతో పనిచేసేదని ఆయన మరోసారి వ్యాఖ్యానించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News