Friday, November 15, 2024

మహాత్మా గాంధీ కళలను సహకారం చేస్తున్నాం

- Advertisement -
- Advertisement -

నిర్మల్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర దశాద్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం స్థానిక దివ్యా గార్డెన్‌లో తెలంగాణ సుపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అటవీ, పర్యావరణ, న్యాయ,దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి , జడ్పీ చైర్మన్ కోరిపెల్లి విజయలక్ష్మీ, జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి, ఎస్పీ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్యేలు రేఖశ్యాంనాయక్, విఠల్ రెడ్డి, డిఎఫ్‌ఓ హిరామాత్‌లు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వరాష్ట్రం సిద్ధిస్తేనే ప్రజలకు చక్కటి పాలన అందిస్తామని 2001లో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మదిలో ఒక దృఢ సంకల్పం ఏర్పచుకొని రాష్ట్రం సిద్దించిన తరువాత అందరి ఆలోచనలకు అనుగుణంగా జిల్లాల పునః విభజనతో సుపరిపాలన అందిస్తున్నాన్నారు.

ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటూ అత్యంత పారదర్శకమైన సుపరిపాలన అందించుకటు వివిధ శాఖలను పున ః వ్యవస్తికరరించి, సిబ్బందితో పాటు అధికారులు, అవసరమైన నిధులు అందజేస్తూ బలోపేతం చేసిందన్నారు. జిల్లాలో మెడికల్ కళాశాలలు మంజూరైయ్యాయని, కొత్తగా ఇంజనీరింగ్ కళాశాలలు , ఐటి టవర్ రాబోతుందన్నారు. పరిపాలన సంస్కరణలు చేపట్టడం ద్వారా ప్రతీ శాఖ ప్రజలకు మరితం చేరువై బాధ్యతగా పని చేస్తున్నాయన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణకు పోలీస్ శాఖకు ఇన్నోవ వాహనాలు, నిధులు కేటాయింపు, షీ టీమ్స్‌ల ఏర్పాటు చేసి ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. వికలాంగుల ఫెన్‌షన్‌లు 3,166 ఉండగా ఇప్పుడు రూ. 4,116కు పెంచడం ఎంతో గౌరకారణమన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డ తరువాత చేపట్టిన సంస్కరణలు, సుపరిపాలన ప్రజలకు అందుతుందన్నారు.

సంక్షేమ కార్యక్రమాలను మననం చేసుకోవడానికి 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. పాలన వికేంద్రీకరణ ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలు తీసుకెళ్లడం కోసం కొత్త జిల్లాల, రెవెన్యూ డివిజన్, మండలాలు , నూతన పురపాలికలు, పంచాయతీలను ఏర్పాటు చేసుకున్నామన్నారు.అంకముందు సుపరిపాలన డాక్యూమెంటరీ వీక్షించారు. జడ్పీ సీఈఓ సుధీర్ జిల్లా ప్రగతి నివేదిక చదివి వినిపించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాం బాబు, ఆర్‌డిఓ శ్రవంతి, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News