Saturday, December 21, 2024

తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తున్నాం

- Advertisement -
- Advertisement -

హన్మకొండ : తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. వరంగల్ పర్యటనకు వచ్చిన పీఎం ముందుగా భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆర్ట్ కళాశాలకు చేర కున్న ఆయన రూ. 6000 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించారు. తెలంగాణ ప్రజలందరికీ అభినందనలు అంటూ తెలుగులో మోడీ ప్రసంగం ప్రారంభించారు. తెలంగాణ ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తయిందన్నారు.

దేశాభివృద్ధిలో తెలంగాణది కీలక పాత్ర అని చెప్పారు. ఆర్థిక వృద్ధిలోను తెలంగాణ ప్రధాన భూమిక పోషిస్తోందన్నారు. దేశాబివృద్ధిలో తెలుగు వారి ప్రతిభ కీలకంగా మారిందన్నారు. దేశాభివృద్ధి కోసం శర వేగంగా పనులు పూర్తి చేసుకున్నామన్నారు.

అనేక ఆర్థిక కారిడార్లను పూర్తి చేసుకుంటున్నామని, హైవేలు, ఎక్స్‌ప్రెస్ వేలు, ఇండస్ట్రియల్ .. ఎకనామిక్ కారిడార్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తెలంగాణలో ముఖ్య చారిత్రక, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలున్నాయని, కరీంనగర్ గ్రానైట్ పరిశ్రమకు కేంద్రం సహకారం అంది స్తుందన్నారు. రైల్వే ఉత్పత్తుల విషయంలో రికార్డులు సృష్టిస్తున్నాయన్నారు. తెలం గాణకు ద్రోహం చేసింది ఆ రెండు పార్టీలనని ప్రధాని మోడీ అన్నారు. కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌లపై విమర్శలు చేశారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రధానిని తిట్టడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి మర్చిపోయిందన్నారు. ఎక్కడ ప్రాజెక్టు కట్టినా అవినీతి తప్పా ఏమీ లేదన్నారు. కుటుంబ పాలన కొనసాగిస్తున్న బిఆర్‌ఎస్ సర్పంచులను ఇబ్బందులు పెడుతుందని, వారు సైతం బిఆర్‌ఎస్ సర్కారుపై కోపంగా ఉన్నారన్నారు.

తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు ట్రైలర్ చూపించామని త్వరలో తెలంగాణలో అధికారం ఖాయమన్నారు. బిఆర్‌ఎస్ సర్కారు నిరుద్యోగులను సైతం మోసం చేసిందని, ఉద్యమ సమయంలో చేసిన వాగ్ధానాలను మొత్తం మర్చిపోయిందన్నారు. ఈ కార్యక్రమానికి బిజెపి అధికార ప్రతినిధి ప్రేమేందర్‌రెడ్డి అధ్యక్షత వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News