కోనరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే నా లక్ష్యమని వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా కోనరావుపేట మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ లో విద్యార్థులు ప్రజాప్రతినిధులు ప్రముఖులతో కలిసి హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మారుమూల ప్రాంతాలలో ఉ న్న ప్రజలకు వైద్య సౌకర్యాలు మెరుగుపడాలని ఉద్దేశంతోనే రూ. 20 లక్షలతో నిర్మించిన ఆరోగ్య ఉప కేంద్రాన్ని ప్రారంభించామని అన్నారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ దవాఖానాలపై ప్రజలకు నమ్మకం పెరగడంతో 65 ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరుగుతున్నాయని అన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ప్రజలు వెళ్లకపోవడంతో ఆసుపత్రి నేతలే గ్రామాల్లో కి ఎగబడి తమ ఆసుపత్రికి రావాలని పిలుస్తున్నారని అన్నారు.
స్వరాష్ట్రంలో రిజర్వాయర్ల ఏర్పాటుతో ఆకాశం వైపు చూసి వ్యవసాయం చేసే రోజులు పోయాయని అన్నారు. రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని తెలిపారు. అంతేకాకుండా మండల కేంద్రంలో రూ. 30 లక్షల కల్వర్టు, రూ. 30 లక్షలతో ఎగ్లాస్పూర్ గ్రామంలో లో లెవెల్ వంతెన నిర్మాణానికి నిర్మాణానికి భూమి పూజ చేశామని, కోనరావుపేటలో 2 ఓపెన్ జిమ్ ఏర్పాటుకు రూ. 6 లక్షల రూపాయలతో భూమి పూజ చే శామని అన్నారు.
జులై మొదటి మాసంలో గృహలక్ష్మి పథకంతో ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరికి రూ. 3 లక్షలు అందిస్తా మని తెలిపారు. బీసీ బందుతో ప్రతి ఒక్కరికి లక్ష రూపాయల సహకారం అందిస్తామని పేర్కొన్నారు. నేటి కార్గంలో ఇప్పటికే 200 శుద్ధ జల కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్య గౌడ్ జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు, వైస్ ఎంపీపీ వంగపల్లి సుమలత శ్రీనివాస్, సెస్ వైస్ చైర్మన్ తిరుపతి,సర్పంచ్ పోకల రేఖ,ఉప సర్పంచ్ దండు శ్రీనివాస్,ఎంపిటిసి నరసింహాచారి,రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు గోగు ప్రతాపరెడ్డి, టిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య, అన్ని గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు టిఆర్‌ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.