Friday, December 20, 2024

మున్సిపాలిటీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నాం

- Advertisement -
- Advertisement -

లక్షెట్టిపేట : లక్షెట్టిపేట మున్సిపాలిటీని న్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు అన్నారు. శుక్రవారం తెలంగాణ దశాబ్ది వేడుకల్లోని పట్టణ ప్రగతిలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం పట్టణ ప్రగతి ఆవశ్యకతను వివరిస్తూ స్థానిక పాత బస్టాండ్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు.

అనంతరం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి నివేధిక సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ నూతన మున్సిపాలిటీ అనంతరం జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు చదివి వినిపించారు. పారిశుధ్య కార్మికుల సేవలు వెల కట్టలేనివని కొనియాడారు.

అంతకు ముందు మున్సిపల్ చైర్మన్ కాంతయ్య మాట్లాడుతూ పట్టణ ప్రగతి నిధులతో మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దామన్నారు. ముఖ్యంగా సఫాయి అన్న మీ కు సలాం అంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, సపాయి కార్మికుల గొప్ప తనాన్ని వివరించిందన్నారు. అంతకు ముందు వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ఒకప్పుడు గ్రామ పంచాయతీగా ఉన్న లక్షెట్టిపేట మున్సిపాలిటీగా మారడంతో అభివృద్ధి సఫాయా కార్మికుల కష్టాలు తొలగిస్తున్న సిఎం కెసిఆర్‌కు ప్రజల ఆశీస్సులు ఉండాలని కోరారు.

అనంతరం పలు విభాగాల్లో ప్రతి భ కనబరిచిన వారిని శాలువాతో సన్మానించి సర్టిఫికెట్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఉమా కిరణ్, రాజన్న, కో ఆప్ష న్ ప్రవీణ్, నాయకులు పాదం శ్రీనివాస్, మున్సిపల్ మేనేజర్ శ్రీహరి, సిబ్బంది దినేష్, చరణ్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News