Monday, December 23, 2024

జయశంకర్ సార్ ఆశయాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం

- Advertisement -
- Advertisement -

ప్రజల గుండెల్లో చిరస్మరణీయులుగా ప్రొ. జయశంకర్ నిలిచారు:  ముఖ్యమంత్రి కెసిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ :తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా స్వరాష్ట్ర సాధన కోసం తన చివరిశ్వాస వరకు పోరాడిన ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్మరణీయులుగా ఉంటారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. ఆదివారం నాడు ప్రొ.జయశంకర్ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర సాధనకోసం ఆయన చేసిన త్యాగం, సేవలను శనివారం నాడు సిఎం కెసిఆర్ గుర్తుచేసుకున్నారు. సకల జనుల సంక్షేమం, సబ్బండ వర్గాల సమానత్వం కోసమే తెలంగాణ స్వరాష్ట్రమని తెలిపిన ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని సిఎం కెసిఆర్ తెలిపారు.

రాష్ట్రాన్ని సాధించిన తొమ్మిదేళ్ల కాలంలోనే సాగునీటి రంగం, వ్యవసాయం, విద్యా, వైద్యం వంటి పలు రంగాల్లో అభివృద్ధిని సాధిస్తూ నేడు దేశానికే ఆదర్శంగా తెలంగాణ పాలన సాగుతోందని, అలాగే సామాజిక ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తోందని సిఎం తెలిపారు. వ్యవసాయ రంగం నుంచి ఐటి, టెక్నాలజీ రంగాల వరకు అన్ని రంగాల్లోనూ తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందన్నారు. ప్రపంచ దేశాలు కూడా ఇవాళ తెలంగాణ వైపు చూసేలా అభివృద్ధి సాక్షత్కార్యమైందన్నారు. బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా, ప్రొ.జయశంకర్ కలలుగన్న సకల జనుల అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగుతామని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News