Wednesday, April 30, 2025

ఆధార్ లాగా భూధార్ కార్డులు వస్తున్నాయి: మంత్రి పొన్నం

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో ఆధార్ కార్డుల లాగా భూధార్ కార్డులు వస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణితో లక్షలాది భూ సమస్యలు వచ్చాయని, ఇచ్చిన హామీ మేరకు నూతన భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చామని మంత్రి పొన్నం పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఎక్స్ వేదికగా మంత్రి ఆసక్తికర ట్వీట్ చేశారు. భూ భారతి పై అన్ని మండలాల్లో అధికారులచే అవగాహన కల్పిస్తున్నామన్నారు. భూమి అంటేనే ఆత్మగౌరవం అని అలాంటి భూమి పై పంచాయతీలు హత్యల వరకు దారితీస్తున్నాయని అన్నారు. భూ వివాదాల్లో గతంలో ఎంఆర్‌ఓను కూడా తగలబెట్టిన ఘటనలు చూశామన్నారు. ధరణి ద్వారా దశాబ్దాల క్రితం భూమి అమ్మిన కూడా తిరిగి అమ్మిన వ్యక్తి పేరు మీదనే భూ హక్కులు వచ్చాయన్నారు.

దీని ద్వారా లక్షలాది మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గతంలో భూమి అమ్మినప్పుడు ఆ గ్రామ పెద్ద మనుషులు చెప్తే అయిపోతుందని, తర్వాత తెల్ల కాగితాల మీద రాసుకోవడం రిజిస్ట్రేషన్ లు వచ్చాయన్నారు. ఇప్పుడు భూమి ఒకరిపై ఉంటే రిజిస్టేషన్లు మరొకరి పై ఉందని తెలిపారు. ప్రభుత్వ భూములు కాపాడండి ఆది ప్రజల ఆస్తి అని మంత్రి పొన్నం పేర్కొన్నారు. ప్రభుత్వ భూమి ప్రభుత్వ ఆస్తి ప్రజా అవసరాలకు విద్యా, వ్యవసాయ గ్రామ అవసరాల కోసం ఉపయోగించుకోవాలన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం చిగురు మామిడి మండల కేంద్రంలో కొత్త ఆర్‌ఓఆర్ చట్టం భూ భారతి పై అవగాహన సదస్సుకి హాజరు కావడం జరిగిందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News