Friday, November 15, 2024

టీకా రాజకీయాలు మానేస్తే దేశంలో కొవిడ్ అంతమయినట్లే

- Advertisement -
- Advertisement -

We are in endgame of Covid-19 pandemic in India:Harsh Vardhan

 

ఆరోగ్య మంత్రి హర్షవర్థన్
సైన్సును నమ్మాలని పిలుపు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి అంత్యదశలో ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్ ఆదివారం తెలిపారు. ఇది అత్యంత కీలక దశ అని, ఇందులో విజయం సాధించాలంటే కొవిడ్ 19 వ్యాక్సినేషన్ ప్రక్రియను రాజకీయాలకు దూరంగా ఉంచాలని కోరారు. టీకాల పంపిణీపై రాజకీయ క్రీనీడలు పడకుండా ఉంటే తప్పనిసరిగా దేశంలో కొవిడ్ అంతం అయి తీరుతుందన్నారు. ప్రజలు సైన్సుపై నమ్మకాలు పెట్టుకోవాలన్నారు. శాస్త్ర విజ్ఞాన ఫలితంగానే వ్యాక్సిన్ వచ్చిందని, దీనిని సకాలంలోనే అయిన వారికి అందించేందుకు అంతా పాటుపడాల్సి ఉందని కోరారు. స్థానికంగా ఢిల్లీ మెడికల్ అసోసియేషన్ (డిఎంఎ) ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన 62వ ఢిల్లీ స్టేట్ మెడికల్ కాన్ఫరెన్స్ (మెడికాన్ 2021) వార్షికోత్సవ సభలో మంత్రి మాట్లాడారు. ధర్మశిల నారాయణ ఆసుపత్రి సహకారంతో ఈ సమావేశం ఏర్పాటు అయింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా రెండు కోట్ల మందికి కరోనా టీకాలు వేశారని, ఇప్పుడు రోజువారి టీకాల పంపిణీ స్థాయి 15 లక్షలకు చేరిందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

కొవిడ్ నియంత్రణలో దేశం అన్నింటా బాగా వ్యవహరిస్తోందని, పలు రకాల అదుపు చర్యలు చేపట్టారని, ఇక ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన దేశంలో వ్యాక్సిన్ల సరఫరా పెరుగుతోందన్నారు. పైగా అత్యంత సమర్థవంతం, సురక్షితం అయిన టీకాలనే అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఎటువంటి ప్రతికూలతలు లేకుండా ఇక్కడ వ్యాక్సిన్లు బాగా పనిచేస్తున్నాయని, ఈ భారత్ తయారీ వ్యాక్సిన్ల సామర్థంఅన్ని విధాలుగా నిరూపితం అయిందని చెప్పారు. వివిధ రకాల కరోనా వైరస్‌ల నుంచి భారతదేశం సురక్షితంగా ఉండటం అనేది అన్ని దేశాల్లో పరిస్థితిని బట్టి ఆధారపడి ఉంటుందన్నారు. అక్కడ వైరస్ నుంచి భద్రత లేకపోతే దీని ప్రభావం ప్రస్తుత గ్లోబలైజేషన్ పరిస్థితుల మధ్య మనదేశంపైనా ఉంటుందని తెలిపారు. అందుకే అన్ని దేశాలు విధిగా కొవిడ్ 19 వ్యాక్సినేషన్ జాతీయవాదాన్ని అవలంభించాల్సి ఉంటుందని సూచించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News