Monday, January 20, 2025

ఎమ్మెల్యే మెచ్చాకు రుణపడి ఉంటాం

- Advertisement -
- Advertisement -

దమ్మపేట : అశ్వారావుపేట మండలం, వేదాంతపురం పంచాయితీ, తిమ్మాపురం గ్రామస్థులు ఆదివారం ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావును దమ్మపేట మండలంలోని తాటిసుబ్బన్నగూడెం గ్రామంలో ఆయన నివాసలో కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 30 సంవత్సరాల నుంచి విద్యుత్ సౌకర్యం లేకుండా చీకట్లోనే బ్రతికామని, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు 2018 ఎన్నికల సమయంలో ప్రచారానికి వెళ్లిన సందర్భంగా ఆ గ్రామస్థులు విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసి గ్రామాన్ని అభివృద్ది చేయాలని కోరగా, జరిగిన పరిణామాలలో ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో గ్రామానికి విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయటం పట్ల జీవితాంతం ఋణపడి ఉంటామని చెబుతూ గ్రామానికి మంచి నీరు కూడా ఏర్పాటు చేయాలని కోరారు.

వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంత ఎండలో ఆటోలు వేసుకొని రావడం ఎందుకమ్మా, పిలిస్తే నేనే వచ్చేవాడిని కదా మన గ్రామానికి అంటూ ఆప్యాయంగా మాట్లాడుతూ వారి సమస్యను అడిగి తెలుసుకొని వెంటనే అక్కడ బోర్ వేసి ఇంటింటికీ పైప్ లైన్ వెయ్యాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. అంతే కాకుండా వచ్చిన ప్రతి ఒకరితో ప్రేమగా మాట్లాడిన ఆయన వచ్చిన ఆటోకి కిరాయి ఖర్చులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ మహిళ కోయ బాషలో మాట్లాడుతూ మళ్ళీ ఎమ్మెల్యేగా మెచ్చా నాగేశ్వరరావుని గెలిపించుకోవాలని, గతంలో కొందరు ఎన్నికల సమయంలో చేసేస్తాం అంటూ మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని పక్కన పడ్డారని పట్టించుకున్న నాథుడే లేడనీ కానీ మాట ఇచ్చి మాట నిలబెట్టుకున్న వారిని మనం మర్చిపోకూడదనీ గ్రామంలో నూటికి నూరుశాతం మీకే మద్దతు ఉంటుందని ఎమ్మెల్యే మెచ్చాకు తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News