- Advertisement -
పంజాబ్ ఉపముఖ్యమంత్రి రణ్‌ధావా
చండీగఢ్: పాకిస్థాన్ రక్షణ జర్నలిస్టుగా పని చేస్తున్న మహిళా జర్నలిస్టు అరూసా ఆలమ్ ద్వారా పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐతో మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్‌కు ఉన్న సంబంధాలపై రాష్ట్రప్రభుత్వం దర్యాప్తు జరుపుతందని పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌జిందర్ సింగ్ రణ్‌ధావా శుక్రవారం చెప్పారు. ఐఎస్‌ఐ, పాకిస్థాన్‌తో తనకున్న సంబంధాల కారణంగానే అమరీందర్ దేశ భద్రత అంశాన్ని లేవనెత్తుతున్నారని, దేశ భద్రతకు పిసిసి అధ్యక్షుడు నవ్‌జ్యోత్ సింగ్ ముప్పని అంటున్నారని ఆయన ఆరోపించారు. అమరీందర్ సింగ్ ఇటీవల హోంమంత్రి అమిత్ షాను కలవడానికి ఢిల్లీ వెళ్లినప్పుడు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ను కూడా కలిశారని ఆయన అన్నారు.
- Advertisement -